ఉత్తమ్ పై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫైర్.. ఎన్నికల్లో ఓటుకు 50లక్షలు ఆఫర్ చేసింది కాంగ్రెస్ అని సంచలనం
కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ విధానాలు నచ్చే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేగా కాంతారావు చెప్పారు. ఆదివాసీల సమస్యలపై స్పందిస్తున్న కేసీఆర్ తీరు తమను ఆకర్షించిందని అందుకే పార్టీ మారుతున్నమని వారన్నారు. డబ్బులకు అమ్ముడు పోయే కల్చర్ తమకు లేదన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అలా అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండే వారిమనీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే 50 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రేగా కాంతారావు, ఆత్రం సుక్కు లు కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను,ఎంపీలను చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.ఆదీవాసీల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని సక్కు మండిపడ్డారు. ఆదీవాసీల సమస్యలపై కేసీఆర్ స్పందన చూసీ టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు.సమస్యలపై సీఎంను కలిసేందుకు తమకుపార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. డబ్బులకు అమ్ముడు పోయే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఓటు వేసేందుకు రూ. 50 లక్షలు చెల్లిస్తామని కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు చెప్పారన్నారు.

డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లమే అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాళ్లమని వారు గుర్తు చేశారు.
పార్టీ మారినంత మాత్రాన నియోజకవర్గాల్లో ధర్నాలు చేయిస్తామని చెప్పటం సమంజసం కాదని తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా ధర్నాలు చేస్తారో చూస్తామని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేస్తామన్నారు. మళ్లీ పోటీ చేసినా తిరిగి గెలిచే సత్తా తమకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications