టీ హబ్‌ అద్భుతం, కలిసి పనిచేస్తాం: కెటిఆర్‌పై మనోహర్ పారికర్ ప్రశంసలు

హైదరాబాద్‌: వినూత్న పద్ధతుల్లో తెలంగాణ ఐటీ రంగాన్ని సమర్థంగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర మంత్రి కే తారకరామారావుకు మరోసారి ప్రశంసలు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్‌‌ను ప్రశంసించిన కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్.. మంత్రి కెటిఆర్‌ను కొనియాడారు.

రక్షణ పరిశోధనల రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీహబ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు. ఆయన ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టీహబ్‌ ద్వారా అంకుర పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పారికర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌నగరంలో రక్షణ సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేపట్టేందుకు, ఈ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు, సరైన అవకాశాలను కల్పించేందుకు టీ-హబ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. డీఆర్డీవో బృందం ఇప్పటికే టీహబ్‌ను సందర్శించిందని, కలిసిపనిచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలోనే సమగ్ర ప్రణాళికతో అవగాహన కుదుర్చుకుంటామని కేంద్ర రక్షణ మంత్రి వెల్లడించారు.

Defence Minister Parrikar praises KTR for T-Hub initiative

మనోహర్‌పారికర్‌ లేఖపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కేంద్ర రక్షణ రంగానికి చెందిన అనేక సంస్థలున్నందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షణ, ఎయిరోస్పేస్‌ రంగాల్లో ఇంక్యూబేటర్‌లను ప్రారంభించేలా చూడాలని కోరుతామన్నారు.

మా దేశానికి రండి: మలేషియా ప్రభుత్వం లేఖ

తెలంగాణలో ఇటీవల పర్యటించిన మలేషియా పరిశ్రమలు, అంతర్జాతీయ వ్యాపార శాఖ మంత్రి ముస్తఫా మహ్మద్‌ తమ దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో దీర్ఘకాలిక మైత్రిని కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఈమేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు.

తెలంగాణలో ఉన్న మలేషియా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఇదే విధంగా కొనసాగించాలని, తెలంగాణతో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు తమ దేశానికి రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆయన ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+