వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో దిగజారుడు రాజకీయం.. ఓట్లకోసం మరీ ఇంతగానా? ఆ వీడియోతో ఓటర్లలో చర్చ!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడులో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు, పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ, ప్రత్యర్థులపై దాడి చేస్తున్నారు. అంతేకాదు మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం, సెంటిమెంట్ అస్త్రాలను సంధిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా చిత్రవిచిత్రమైన పనులకు తెరతీశారు.

మునుగోడులో ఓట్ల కోసం రాజకీయ నాయకుల చిత్ర విచిత్ర విన్యాసాలు

మునుగోడులో ఓట్ల కోసం రాజకీయ నాయకుల చిత్ర విచిత్ర విన్యాసాలు

మునుగోడులో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం గుంపులుగా రంగంలోకి దిగిన పొలిటికల్ పార్టీల నాయకులు ఈ పని, ఆ పని అన్న తేడా లేకుండా అన్ని పనులు చేసి పారేస్తున్నారు. ఓట్లు అడగడానికి వెళ్లి హోటల్లో దోస లు వేస్తూ, టీ పెట్టి అందరికీ ఇస్తూ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇళ్లకు వెళ్లి ఓట్లను అడుగుతున్న క్రమంలో వారి ఇళ్లల్లోని పనులను అందుకుంటున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి, మరికొంత మంది మద్యంతో ప్రలోభపెట్టి, ఇంకొంతమంది విందులు, వినోదాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఓట్ల కోసం మంత్రులు, ముఖ్య నాయకుల పాట్లు

ఓట్ల కోసం మంత్రులు, ముఖ్య నాయకుల పాట్లు

మంత్రులు హోటళ్ళలో వంట చేస్తూ సందడి చేస్తున్నారు. కొందరు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి ఫ్రేములు కట్టించి మరీ ఇస్తున్నారు. కొందరు ఇస్త్రీ చేస్తూ, సెలూన్ లలో హంగామా చేస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు ఇళ్ళలో మహిళలకు సాయంగా పనులు చేసి పెడుతున్నారు. గోరింటాకు పెట్టి కొందరు, పూలిచ్చి కొందరు , ఇక కావాల్సిన నిత్యావసరాలు అందించటం నుండి ఒకటేమిటీ ఓట్ల కోసం వారు చెయ్యని పనిలేదు.

పిల్లల మలవిసర్జన తర్వాత శుభ్రంగా కడుగుతున్న వీడియో వైరల్


ఇక కొందరు నేతలు అయితే ఏకంగా పిల్లలకు స్నానం చేయించడం, పిల్లలు మల విసర్జన చేసిన తర్వాత శుభ్రంగా కడగడం వంటి పనులు చేస్తూ, మీ ఓటు మాకే అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అటువంటి పనులు చేస్తూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓట్ల కోసం ఏమైనా చేస్తారంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఓట్ల కోసం మరీ ఇంత దిగజారుడు అవసరమా అని ఓటర్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

మరీ దిగజారుడు పనులు చేస్తున్న నాయకుల తీరుపై ఓటర్లలో చర్చ

మరీ దిగజారుడు పనులు చేస్తున్న నాయకుల తీరుపై ఓటర్లలో చర్చ

ఏదైనా సమస్య ఉన్నదని చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు అక్కా, చెల్లి అంటూ ఓట్ల కోసం పడుతున్న పాట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఓటర్లను తమ వైపు తిప్పుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు మరీ దిగజారుడుగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఛీ ఇదేమి రాజకీయం అని చిరాకు పడుతున్నారు. ఓటు కోసం కోటి డ్రామాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
In Munugode, leaders desperation for votes is evident in a video. A video of a political leader who is cleaning a small child after the kid defecating went viral on social media, causing a debate among voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X