భార్య డబ్బులిస్తేనే డిల్లీకి వెళ్తున్నా, ఐదువేల రూపాయాలు ఇమె ఇచ్చారు

తన భార్య ఇచ్చిన నగదుతోనే తాను డిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ . ఆమె తనకు వంద రూపాయాల నోట్ల కట్టలు ఐదువేల రూపాయాలను ఇచ్చినట్టు మంత్రి ప్రకటించారు.

హైదరాబాద్ : పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పైనా పడింది.ఆయన తన భార్య జమున ఇచ్చిన డబ్బులతోనే ఆయన డిల్లీ వెళ్ళారు. స్వయంగా మంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. డిల్లీలో ఖర్చుల కోసం ఐదువేల రూపాయాలనగదును ఆయన భార్య నుండి తీసుకొన్నట్టు చెప్పారు మంత్రి.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు ఢిల్లీ వెళ్ళారు.అయితే ఢిల్లీలో ఖర్చుల నిమిత్తం తన భార్య జమున వద్ద నుండి ఐదువేల రూపాయాలను తీసుకొన్నాడు. ఆమె మంత్రికి వంద రూపాయాల నోట్ల కట్టలను ఇచ్చారు.

demonetasion effect on telangana state finance minister etela rajender

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా వంద రూపాయాల నగదు కట్టలను ఆమె మంత్రికి ఇచ్చారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా డిల్లీలో అవసరాలకు వాడుకొనేందుకు గాను ఆమె ఈ నగదును అందించారు.

మంత్రి సతీమణి జమున ఫౌల్ట్రీ వ్యాపారాన్ని చూస్తారు. ఈ వ్యాపారంలో లావాదేవీలన్నింటిని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తారు.రాజకీయాల్లో కొనసాగుతున్నందున వ్యాపారాలకు దూరంగా ఉంటున్నారని మంత్రి సన్నిహితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+