వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్‌లో కీలక సవరణ: జైలు శిక్షపై తగ్గిన కేంద్రం.. కానీ, 'కొత్త నోట్లపై శుభవార్త'

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పదివేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తం కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధిస్తామన్న ఆర్డినెన్స్ పైన కేంద్రం గురువారం నాడు వెనక్కి తగ్గింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పదివేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తం కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధిస్తామన్న ఆర్డినెన్స్ పైన కేంద్రం గురువారం నాడు కొంత వెనక్కి తగ్గింది. బుధవారం కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌కు కీలక సవరణలు చేసింది.

 Demonetisation Ordinance w.e.f Dec 31: No jail for having banned notes, minimum Rs 10000 fine

కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు కలిగి ఉంటే రూ.10వేలు కనీస జరిమానా, జైలు శిక్ష విధించే ఆర్డినెన్స్‌కు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుకోనుంది.

నోట్ల రద్దు-అసలు విషయం ఇదీ: ఆర్బీఐ చెప్పిన గంటల్లోనే మోడీ షాకిచ్చారు! నోట్ల రద్దు-అసలు విషయం ఇదీ: ఆర్బీఐ చెప్పిన గంటల్లోనే మోడీ షాకిచ్చారు!

అయితే, ఈ ఆర్డినెన్స్‌లో కీలక సవరణ చేశారని తెలుస్తోంది. రద్దయిన నోట్లు కలిగి ఉంటే జైలు శిక్ష విధిస్తారనే నిబంధన తొలగించారు. జరిమానా మాత్రం పడనుంది. కాగా, ఈ నెల 31నుంచి ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి రానుంది.

నోట్ల రద్దుపై చిన్న శుభవార్త

నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రజలకు చిన్న శుభవార్తను చెప్పారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

నోట్ల రద్దుకు 50 రోజులు: విత్ డ్రా‌పై మోడీ ఊరట ప్రకటన!నోట్ల రద్దుకు 50 రోజులు: విత్ డ్రా‌పై మోడీ ఊరట ప్రకటన!

కొత్త రూ.500 నోట్ల ముద్రణ పెరిగిందని చెప్పారు. బ్యాంకుల దగ్గర క్యూలు తగ్గాయన్నారు. జనాలకు కావాల్సినంత డబ్బు బ్యాంకుల నుంచి అందుతోందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత అన్ని రకాల పన్నుల వసూళ్లు పెరిగాయన్నారు. కొత్త నోట్ల కోసం ఇక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.

English summary
In the Ordinance that followed the expiration of the deadline for depositing old Rs 500 and 1,000 notes, there is no provision for jail for holding banned notes but a minimum fine of Rs 10,000 will be imposed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X