రూ 3.04 లక్షల కోట్ల బడ్జెట్ - కేటాయింపులు ఇలా..!!

తెలంగాణబడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మంత్రివర్గ ఆమోదం తరువాత సభలో బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించారు. దశాబ్ద కా అన్ని వ్యవస్థలు రాష్ట్రంలో ధ్వంసం అయ్యాయని... గాడిన పెట్టే క్రమంలో తమ ప్రభుత్వ క్రమశి ణతో వ్యవహరిస్తోందని భట్టి చెప్పుకొచ్చారు. అధికారం హోదాగా తాము భావించటం లేదని.. బాధ్య తో అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని పని చేస్తున్నామని చెప్పారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు.

బడ్జెట్ అంచనాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ 3.04 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ బడ్జెట్ లో భట్టి
రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం - రూ.36,504 కోట్లు గా పేర్కొన్నారు. ఇక.. వ్యవసాయశాఖ - రూ.24,439 కోట్లు కేటాయింపులు చేసారు. పశుసంవర్ధకం - రూ.1,674 కోట్లు, పౌరసరఫరాలశాఖ - రూ.5,734 కోట్లు, విద్యా రంగం - రూ.23,108 కోట్లు గా ప్రతిపాదించారు.

Deputy CM Bhatti Vikramarka presents Telangana Budget 2025-26 in the Assembly allocations here

శాఖల వారీగా
శాఖల వారీగా కార్మికశాఖ - రూ.900 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ - రూ.31,605 కోట్లు, మహిళా శిశుసంక్షేమశాఖ - రూ.2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు, చేనేత రంగం - రూ.371 కోట్లు,మైనార్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు, పరిశ్రమలు - రూ.3,527 కోట్లు, ఐటీ రంగం - రూ.774 కోట్లు, విద్యుత్‌ రంగం - రూ.21,221 కోట్లు, వైద్య రంగం - రూ.12,393 కోట్లు, పురపాలక రంగం - రూ.17,677 కోట్లు, నీటిపారుదల శాఖ - రూ.23,373 కోట్లు, రహదారులు, భవనాల ఖ - రూ.5,907 కోట్లు, పర్యాటక రంగం - రూ.775 కోట్లు, క్రీడలు - రూ.465 కోట్లు,అటవీ,పర్యావరణం - రూ.1,023 కోట్లు, దేవాదాయశాఖ - రూ.190 కోట్లు, హోంశాఖ - రూ.10,188 కోట్లు కేటాయించారు.

వృద్ధిరేటు 10.1 శాతం
డిప్యూటీ సీఎం భట్టి తన బడ్జెట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్‌ పీ రూ.16,12,579 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. జీఎస్‌డీపీ వృద్ధిరేటు జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువని వెల్లడించారు. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.1 శాతం, జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం గా వివరించారు. దేశ జీడీపీ రూ.3,31,03,215 కోట్లు కాగా, 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751 గా ఉంది. ఇక, రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం గా ఉండగా.. దేశ తలసరి ఆదాయం రూ.2,05, 79 కోట్లుగా పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతం.. దేశ తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు గా వివరించారు.

పథకాలకు ప్రాధాన్యత
ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా చేయగలిగామని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగిందని చెప్పారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వివరించారు. సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించామని చెప్పారు. గృహ తి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగినట్లు లెక్కలు వివరించారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కోసం రూ.1,775 కోట్లు రాయితీ ఇచ్చినట్లు భట్టి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+