స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు పడింది!
హైదరాబాద్: మూడు రోజుల క్రితం తెలంగాణ సీఎంవో అధికారిణి, సీనియర్ మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ సీరియస్‌గా స్పందించింది. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆనంద్ కుమార్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

రాత్రి 11.40 గంటలకు స్మితా సబర్వాల్ ఇంటికి ఆనంద్ కుమార్
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్ వ్యాలీ బీ-11లో స్మితా సబర్వాల్ నివసిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే నివసిస్తుండటంతో నిరంతరం పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. కాగా, జనవరి 19న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్ కుమార్ రెడ్డి, అతడి స్నేహితుడు, హోటల్ నిర్వాహకుడైన కొత్త బాబుతో కలిసి కారులో ప్లజెంట్ వ్యాలీ వద్దకు చేరుకున్నారు.

స్మిత సబర్వాల్ ఇంటి తలుపుతట్టిన డిప్యూటీ తహసీల్దార్
బీ-17కు
వెళ్లాలంటూ
సెక్యూరిటీ
గేటు
వద్ద
సిబ్బందికి
చెప్పి,
నేరుగా
స్మితా
సబర్వాల్
నివాసం(బీ-11)
వద్దకు
వెళ్లాడు.
బాబు
కారులోనే
ఉండగా..
ఆనంద్
కుమార్
రెడ్డి
మాత్రం
స్మితా
సబర్వాల్
ఇంటి
మొదటి
అంతస్తులోకి
వెళ్లి
తలుపు
తట్టాడు.
షాక్‌కు
గురైన
ఆమె
వెంటనే
డయల్
100కు
సమాచారం
ఇచ్చారు.
స్మితా
అప్రమత్తం
చేయడంతో
భద్రతా
సిబ్బంది..
ఆనంద్
కుమార్
రెడ్డిని
పట్టుకున్నారు.
కొద్దిసేపటికే
జూబ్లీహిల్స్
పోలీసులొచ్చి
ఆనంద్‌ను,
కారులో
ఉన్న
బాబును
కూడా
అదుపులోకి
తీసుకున్నారు.
వారిపై
ఐపీసీ
సెక్షన్
458,
రెడ్
విత్
34
కింద
కేసు
నమోదు
చేసి
జడ్జీ
ఎదుట
హాజరుపర్చారు.
దీంతో
14
రోజుల
రిమాండ్
విధించారు.

గుమ్మం వద్ద ఉన్నానంటూ స్మితాకు డిప్యూటీ తహసీల్దార్ ట్వీట్
కాగా,
స్మితా
సబర్వాల్
ఇంట్లోకి
ప్రవేశించే
ముందు..
రాత్రి
11.34
నిమిషాలకు
మీ
ఇంటి
గుమ్మం
వద్ద
ఉన్నా
అంటూ
ఆమెకు
ఆనంద్
ట్వీట్
చేసినట్లు
పోలీసులు
గుర్తించారు.
కాగా,
ఆనంద్
కుమార్
రెడ్డి
గతంలో
చిత్తూరు
జిల్లాలో
ప్రభుత్వ
ఉద్యోగంతోపాటు
పాత్రికేయుడిగా
కూడా
పనిచేసినట్లు
గుర్తించారు.
గ్రూపు-2లో
ఎంపికై
2018లో
హైదరాబాద్
లో
డిప్యూటీ
తహసీల్దార్
గా
నియమితులయ్యారు.
ప్రస్తుతం
డిప్యూటేషన్
పై
పౌర
సరఫరాల
విభాగంలో
పనిచేస్తున్నారు.
శామీర్
పేటలోని
అలియా
బాద్‌లో
ఆనంద్
కుమార్
రెడ్డి,
బాబు
ఒకే
భవనంలో
వేర్వేరు
అంతస్తులో
ఉంటున్నారు.