పారపట్టి మట్టి ఎత్తిన కేసీఆర్, గజ్వేల్ జిగేల్(పిక్చర్స్)
మెదక్: ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం చెప్పారు. మెదక్ జిల్లా గజ్వెల్ పట్టణంతో పాటు ములుగు మండలం మర్కూక్ గ్రామంలో రూ.98.72 కోట్లతో చేపట్టననున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రానున్న రెండేళ్లలో గజ్వెల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. గజ్వెల్‌కు వచ్చి నివసిస్తే బాగుండని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గజ్వెల్ నగర పంచాయతీ పరిధి సంగాపూర్లో అత్యాధునిక సదుపాయాలతో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. సకల సౌకర్యాలతో దీనిని ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామన్నారు.
పట్టణంలోని పాండవుల చెరువును మినీ ట్యాంకుబండుగా మారుస్తామని చెప్పిన కేసీఆర్... ఇందుకు రూ.8 కోట్లు మంజూరు చేశారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత వెనుదిరుగుతున్న సమయంలో వాహన శ్రేణిని మళ్లించి, నేరుగా చెరువు వద్దకు వెళ్లారు. దానిని పరిశీలించారు. పలుగు పట్టి, మట్టి తవ్వి ట్రాక్టరులో పోశారు. గజ్వేల్‌ను జిగేల్ మనేలా చేస్తామన్నారు.

కేసీఆర్
మెదక్ జిల్లా గజ్వేల్‌లో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 98 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

కేసీఆర్
రెండేండ్లలో గజ్వేల్‌ను సుందరనగరంగా, ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వచ్చే ఏడు నెలల్లో మంచినీళ్లు అందిస్తామన్నారు.

కేసీఆర్
గజ్వేల్‌లో త్వరలో ప్రత్యేక టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టి మూడు వేల మంది పేదలకు గృహసౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.

కేసీఆర్
టౌన్‌షిప్ పరిధిలోనే పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, విశాలమైన రోడ్లు, బస్‌బే ఉంటాయన్నారు. స్థానిక సంగాపూర్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ అక్కడికి వెళ్లనున్నాయని సీఎం తెలిపారు.

కేసీఆర్
రానున్న రెండేండ్లలో గజ్వేల్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణాన్ని చూసిన వారెవరైనా ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా రూపురేఖలు మార్చుతామన్నారు.

కేసీఆర్
శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో రూ. 98.72కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ ఇంకా ఎంతో అభివృద్ది చెందాల్సి ఉందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications