బయట పడ్డానికి కామా ఫుల్‌స్టాప్‌లతో చదువుతున్నారు: ఓటుకు నోటుపై దేవీప్రసాద్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావును ఒకే గాటన కట్టి మాట్లాడవద్దని, ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని వివరించారు.

నాన్‌లోకల్‌, జోనల్‌, మల్టీ జోనల్‌ కింద నియమితులైన రెండు ప్రాంతాల ఉద్యోగుల సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. విభజన చట్టం సంక్లిష్టంగా ఉందని, ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్‌ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులను తెచ్చుకుంటామని కమలనాథన్‌కు తెలంగాణ సీఎస్‌ లేఖ రాసినా సమాధానం లేదని ఆయన అన్నారు.

Devi Prasad

ఉమ్మడి రాష్ట్రంలో స్థానికేతర కోటా కింద వివిధ జిల్లాల్లో నియమితులైన రెండు ప్రాంతాల ఉద్యోగులు, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల స్వరాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తున్నామని అంటూ ఈ విషయంలో వారు ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఏపీ ఎన్జీవో నేత పి అశోక్‌బాబుపైనా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెచ్చుకుంటామని కేసీఆర్‌ ప్రకటించి ఏడాదైనా అమల్లోకి రాకపోవడంపై కొంత మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై దేవీప్రసాద్‌ తన ప్రసంగంలో స్పందించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలని కేసీఆర్‌ పట్టుబట్టినా ఆంధ్రా నాయకత్వం లాబీయింగ్‌ వల్ల విభజనచట్టంలో దానిని పొందుపర్చలేకపోయారని, కాబట్టి కేసీఆర్‌ను చంద్రబాబుతో పోల్చడం సరికాదని వివరించారు.

ఓటుకు నోటులో దొరికిపోయిన దొంగలు బయటపడటం కోసమే హడావుడిగా విభజన చట్టంలోని కామా, పుల్‌స్టాప్‌తోసహా చదువుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆంధ్రా-తెలంగాణ ఉద్యోగుల మధ్య యుద్ధం కాదని అన్నారు. ఏపీ ఉద్యోగులపై పెత్తనం చేయాలని చూడటం లేదని, భార్యా భర్తలు, అనారోగ్యం, విడోలు వంటి కేసులకు సంబంధించిన ఆప్షన్లనూ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఏపీ ఎన్జీవో నాయకత్వం నోరుపారేసుకుంటున్నదని అన్నారు. ఏపీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచారని, దానివల్ల తెలంగాణ ఉద్యోగులు ఏపీకి ఆప్షన్‌ ఇస్తున్నారనడం సరికాదన్నారు.

కేసీఆర్‌ రెండు రాష్ట్రాల తెలుగువారి క్షేమం కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ పి రాజేశ్వరరావు అన్నారు. ఎంతో ప్రతిభ కలిగినవారే ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారని, అటువంటి ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదని టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+