గణేష్ పూజ కోసం పూజారిని కిడ్నాప్ చేసిన భక్తులు.. వీడియో వైరల్

వినాయక చవితి వచ్చేసింది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నగరాలు, పల్లెల్లోని గల్లీ గల్లీల్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు ఉత్సాహంగా గణేష్ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇక ఖైరతాబాద్ గణేష్ వద్ద రెండు రోజుల ముందు నుంచే సందడి నెలకొంది. భక్తులు వందల సంఖ్యలో క్యూ లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారు. అయితే సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో గణేష్ పండగ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

https://youtube.com/shorts/arRBubst3fk?si=waM_ZSztnLBhsNif

దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. 11 రోజులపాటు నిరంతరం పూజలు చేస్తారు. ఈనెల 27న మొదలైన వినాయక చవితి నవరాత్రులు సెప్టెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ 11 రోజులపాటు గణేష్ మండపాల వద్ద నిత్యం పూజలు నిర్వహిస్తారు. దీంతో పూజారులకు ఈ నవరాత్రుల్లో ఫుల్ గిరాకీ ఉంటుంది. సాధారణ రోజులతో పోల్చితే ఈ నవరాత్రుల సమయంలో పూజారులకు ఫుల్ డిమాండ్ కూడా ఉంటుంది. దీంతో ఒక్కో పూజారి నాలుగైదు గల్లీలు కవర్ చేయాల్సి వస్తోంది.

Devotees Abduct Priest for Ganapati Puja in Koheda Mandal Video Goes Viral

ఇక నవరాత్రి మొదటి రోజు అయితే వినాయకుడి ప్రతిష్ఠ నేపథ్యంలో కచ్చితంగా ప్రతి మండపానికి పూజారి వెళ్లాల్సిందే. అయితే తాజాగా సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో విచిత్ర సంఘటన జరిగింది. గణపతి పూజ కోసం కొందరు భక్తులు పూజారిని ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. పురోహితుడి కోసం వచ్చిన భక్తులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్లిపోయారు. వారి వినాయకుడి మండపం వద్ద పూజలకు ఆలస్యం అవుతోందని అలా చేసినట్లు సమాచారం. ఆ పూజారి కోహెడకు చెందిన కనకయ్య కాగా.. ఈ వీడియో కాస్తా సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+