హైదరాబాద్‌లో..ఒకే హోటల్‌లో ధనుష్, మాజీ భార్య: విడాకుల తరువాత..అనూహ్యంగా

హైదరాబాద్: కోలీవుడ్ టాప్ హీరో ధనుష్.. ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ వార్తల్లోకెక్కారు. కొద్దిరోజుల కిందటే వారిద్దరు వేరుపడ్డారు. విడాకులు తీసుకున్నారు. 18 సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకున్నారు. విడాకులు తీసుకోవడానికి కారణాలు లేకపోలేదంటూ మీడియాలో కథనాలు విస్తృతంగా వెలువడ్డాయి. ఇద్దరు హీరోయిన్లతో ధనుష్ సన్నిహితంగా ఉంటున్నాడంటూ సుచీ లీక్స్ స్పష్టం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, భర్తతో కలిసి ఉండటానికి ఐశ్వర్య ఇష్టపడకపోవడానికి అదే కారణమనే గాసిప్స్ గుప్పుమన్నాయి.

 హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

దీని సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా ఒకే హోటల్‌లో దిగడం..అదీ హైదరాబాద్‌లో కావడం చర్చనీయాంశమైంది. ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ హైదరాబాద్‌కు వచ్చారు. వారిద్దరూ రామోజీ ఫిల్మ్‌సిటీలోని సితార హోటల్‌లో బస చేశారంటూ ఓ జాతీయ దినపత్రికకు చెందిన వెబ్‌సైట్ వెల్లడించింది. సితార హోటల్‌లో మాజీ దంపతులిద్దరూ ఒకేరోజు..ఒకేసారి దిగారని తెలిపింది.

 పిల్మ్‌సిటీలో షూటింగ్..

పిల్మ్‌సిటీలో షూటింగ్..

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు రామోజీ ఫిల్మ్‌సిటీ కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. దక్షిణాదిలో దాదాపు అన్ని సినిమాల చిత్రీకరణ ఇక్కడ సాగుతుంటుంది. తమిళ సినిమాల షూటింగ్.. తెలుగుతో పోటీ పడుతుంటాయి. షూటింగ్ కోసం వచ్చే సెలెబ్రిటీలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఫిల్మ్‌సిటీలోనే సితార పేరుతో హోటల్ అందుబాటులో ఉంది. తాజాగా ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈ హోటల్‌లో దిగారని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

 సితార హోటల్‌లో..

సితార హోటల్‌లో..

వేర్వేరు సినిమాల షూటింగ్‌లో పాల్గొనడానికి ధనుష్, ఐశ్వర్య ఒకేరోజు ఫిల్మ్‌సిటీ చేరుకున్నారని, కొన్ని గంటల వ్యవధిలో సితార హోటల్‌లో దిగారని తెలిపింది. మారన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు ధనుష్. ఇదో యాక్షన్ థ్రిల్లర్. కార్తీక్ నరేన్ దర్శకుడు. టీజీ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసింది యూనిట్. దానికి అనుగుణంగా సినిమా షూటింగ్ సాగుతోంది.

 బయోపిక్ మూవీకి ఐశ్వర్య దర్శకత్వం..

బయోపిక్ మూవీకి ఐశ్వర్య దర్శకత్వం..

అలాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ మారియప్పన్‌లోనూ ఆయనే హీరో. ఐశ్వర్య రజినీకాంత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మారియప్పన్ తంగవేలు అనే హైజంపర్ బయోపిక్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకోవడానికి ముందే సెట్స్ మీదికి వెళ్లిందట ఈ సినిమా చిత్రీకరణ. విడాకుల తరువాత ఐశ్వర్య మళ్లీ ఈ మూవీ షూటింగ్‌ను పట్టాలెక్కించారు.

చెన్నైలో లేరంటూ..

చెన్నైలో లేరంటూ..

ధనుష్ మీద తెరకెక్కించాల్సిన ఓ పాటను షూట్ చేయడానికి ఆమె కూడా ఫిల్మ్‌సిటీకి వచ్చారని, అక్కడున్నది ఒకే హోటల్ కావడంతో అందులోనే ఇద్దరూ దిగారని పేర్కొంది. వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ధృవీకరించారు. చెన్నైలో లేరని పేర్కొన్నారు. ఫోన్‌లో తాను ధనుష్, ఐశ్వర్యలతో వేర్వేరుగా మాట్లాడానని తమిళ మీడియాకు చెప్పారు. విడిపోయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+