ఒద్దనుకున్నదే కావాల్సొచ్చింది.!గులాబీ పార్టీ దీక్షలకు వేదిక కారున్న ధర్నా చౌక్.!

హైదరాబాద్ : సై అంటే సై.. కమలం, కారు పోటా పోటీ దీక్షలు.. తెలంగాణ రైతులను తొక్కుతారా.?మొక్కుతారా? తెలంగాణ రైతాంగానికి ఈ దీక్షలతో న్యాయం జరుగుతుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అంత కన్నా ముఖ్యంగా ఒకప్పుడు ధర్నా చౌక్ ను నిషేదించిన గులాబీ ప్రభుత్వానికి ఇప్పుడు అదే ధర్నాచౌక్ ను వేదిక చేసుకుని కేంద్రానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దత్తుగా నిరసన దీక్షలు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. కాగా ఒకప్పుడు ధర్నా చౌక్ ఉండకూడదు, ఎందుకు అని నిషేదింన ప్రభుత్వం ఇప్పుడు అదే దర్నా చౌక్ వద్ద దీక్షలు చేయడానికి సన్నాహాలు చేయడం పట్ల ప్రతిపక్షాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

 ధాన్యాన్ని కేంద్రం కొనాలి..తెలంగాణ రైతుల పక్షాన టీఆఎస్ నిరసన దీక్షలు

ధాన్యాన్ని కేంద్రం కొనాలి..తెలంగాణ రైతుల పక్షాన టీఆఎస్ నిరసన దీక్షలు

ఇదిలా ఉండగా తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, సీఎం చంద్రశేఖర్ రావు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుల ఆదేశానుసారం, శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పిలుపునిచ్చారు. కోవిడ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు, ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని నిర్వహించాలని సూచించారు.

 ధాన్యం కొనే వరకు ఆందోళనలు.. ధర్నా చౌక్ వద్ద నిరసనలు

ధాన్యం కొనే వరకు ఆందోళనలు.. ధర్నా చౌక్ వద్ద నిరసనలు

దీక్షల్లో భాగంగా శుక్రవారం రోజు ఉదయం పదిగంటల నుండి మద్నాహ్నం ఒంటి గంట వరకూ రైతులతో కలిసి ఆయా ప్రాంతాల్లో రైతు దర్నాలు చేయాలని శ్రేణులను, రైతులను మంత్రి ఎర్రబెల్లి కోరారు. సమృద్ధిగా సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్...చివరకు కొవిడ్ నేపథ్యంలో పంటల కొనుగోలు దాకా... రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం రైతు బంధు గా పని చేస్తున్నదని ఎర్రబెల్లి చెప్పారు. కేంద్రం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని మంత్రి కోరారు.

 కేంద్రాన్ని ఒప్పించాలి.. బీజేపి నేతలను డిమాండ్ చేసిన గులాబీ దళం

కేంద్రాన్ని ఒప్పించాలి.. బీజేపి నేతలను డిమాండ్ చేసిన గులాబీ దళం

కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం పట్ల కక్ష్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన కేంద్రం, ఇప్పుడు తెలంగాణ రైతుల పంటలను కొనబోమని, రాష్ట్రం కొనకూడదని అదేశించిందన్నరు. ఈ నిరంకుశ అన్యాయ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా దర్నాలు చేసే పరిస్థితిని కల్పించిన కేంద్ర అసమర్థ విధానాల్ని మంత్రి ఎండగట్టే ప్రయత్నం చేసారు.

 రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ.. ఢిల్లీ పీఠం కదిలేలా దీక్షలు..

రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ.. ఢిల్లీ పీఠం కదిలేలా దీక్షలు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకరకంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, రాష్ట్రం ఏం చెబుతుందో కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ తప్పుపడుతున్నారని ఈ గందరగోళం తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే రైతు దర్నాలు నిర్వహిస్తున్నామన్నారు.
రాజ్యాంగం, వ్యవసాయ చట్టాల్ని అనుసరించి, పంటల్ని కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రానికే ఇచ్చారన్నారు. తద్వారా ఏ రాష్ట్రానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం, కొనుగోలు చేసి నిల్వ చేసే ఎఫ్.సి.ఐ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసే అదికారం, స్వంతంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని నిల్వ చేసి ఎగుమతి చేసే అదికారం, సైంటిఫిక్ గోదాముల్ని నిర్వహించే అధికారం లేదని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+