బద్నామ్ చేయడమే వారి పని సార్: గవర్నర్‌తో గంటన్నరపాటు కేసీఆర్ చర్చ

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం దాదాపు గంటన్నర పాటు జరిగిన వీరి భేటీలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. గవర్నర్ పదవీకాలాన్ని రెండోసారి పొడిగించిన తర్వాత ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో ఆయనను కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం అభినందనలు తెలిపినట్లు తెలిసింది.

బద్నామ్ చేయడమే పనిగా..

బద్నామ్ చేయడమే పనిగా..

ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ తరలింపు చిన్న విషయమే అయినా, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. వాస్తవానికి ధర్నా చౌక్‌ను అక్కడి నుంచి తరలించాలన్న ఆలోచన ప్రభుత్వానిది కాదని, స్థానికులు, వాకర్స్ అసోసియేషన్స్ కోర్టుకు వెళ్లగా ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయనున్నట్టు పోలీసులు కోర్టుకు చెప్పారన్నారు.

ఉద్రిక్త పరిస్థితులపై..

ఉద్రిక్త పరిస్థితులపై..

ధర్నా చౌక్ తరలింపునకు అనుకూలంగా, ప్రతికూలంగా జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సిఎం వివరించారు. వారం రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలనూ వివరించారు. గవర్నర్ పదవీకాలం పొడిగించడం పట్ల సిఎం కెసిఆర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆమోదముద్ర పడగానే..

ఆమోదముద్ర పడగానే..

రాష్ట్ర శాసనసభ ఏప్రిల్ 30వ తేదీన ఆమోదించిన భూసేకరణ, పునరావాస బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఆమోద ముద్రవేశారు. ఈ గెజిట్ ప్రతి మంగళవారం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌కు చేరనున్నట్లు సమాచారం, దీనిపై గవర్నర్ ఆమోద ముద్ర పడగానే, బిల్లు అమలులోకి రానుంది.

వివిధ అంశాలపై చర్చ

వివిధ అంశాలపై చర్చ

ఈ క్రమంలో ముఖ్యమంత్రి గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. భూసేకరణలో భూమి కోల్పోయిన బాధితులకు, రైతులకు పూర్తి న్యాయం చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని బిల్లును రూపొందించిన తీరును సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. దీనితోపాటు పలు అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Monday met Governor E.S.L. Narasimhan at Raj Bhavan, and briefed him about the violent incidents that took place earlier in the day.
Please Wait while comments are loading...