ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత, కుర్చీలు విసురుకున్నారు, గాయాలు
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి.

ఒకరిపై ఒకరు కర్రలు, జెండాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంగా రణరంగంగా మారింది. చాలామంది తలలకు గాయాలయ్యాయి. హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో వారిపైనా ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు.












Click it and Unblock the Notifications