హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వదేశంలో పెళ్లి, విదేశాల్లో విడాకులు: ఎన్నారై భర్తల మోసం, శిల్ప పోరాటం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై భర్త మోసం పైన ఓ భార్య న్యాయపోరాటం చేస్తోంది. అత్తమామల ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగింది. తనకు జరుగుతున్న అన్యాయం చాలామంది ఎన్నారై భార్యలు ఎదుర్కొంటున్నారని ఆమె చెబుతున్నారు. ఈ విషయంలో చట్ట సవరణ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

తద్వారా ఆమె కేవలం తన భర్త పైనే కాకుండా... ఎన్నారై భర్తల మోసాల పైన న్యాయపోరాటం చేస్తోంది. నిజాంపేటకు చెందిన శిల్పా రెడ్డి 2006 నుంచి అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అమెరికాలోనే డాక్టర్ చదువుతున్న లోతుకుంటకు చెందిన రజనీకాంత్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లైంది.

Dharna infront of NRI husband's house in Lothukunta

హైదరాబాదులో అన్ని లాంఛనాలతో వివాహం జరిపించారు. అమెరికాలో కాపురం ప్రారంభించిన కొన్ని రోజులకే భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ విడాకులు కోరుతూ భర్త కోర్టుకు వెళ్లాడు. శిల్బారెడ్డి హైదరాబాద్ వచ్చి ఎన్నారై భర్త విడాకులు కోరడాన్ని ప్రశ్నిస్తోంది.

హైదరాబాదులో హిందూ చట్టం ప్రకారం పెళ్లి చేసుకొని, విదేశాల్లో అక్కడి చట్టం ప్రకారం విడాకులు కోరడం ఏమిటని ప్రశ్నిస్తోంది. చట్టంలోని లోపాలను సవరణ చేయాలని ఆమె కోరుతోంది. చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకొని తనలాంటి వారిని ఎందరో ఎన్నారై భర్తలు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dharna infront of NRI husband's house in Lothukunta

ఎన్నారై మోసాలతో పాటు, చట్ట సవరణ, వేధింపులపై న్యాయం చేయాలని సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చి భర్త రజినీకాంత్‌తో మాట్లాడించాలని శిల్పారెడ్డి లోతుకుంటలోని అత్తమామా ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. వారి ఇంటికి తాళం ఉండటంతో పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింప చేశారు.

English summary
Dharna infront of NRI husband's house in Lothukunta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X