Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీఆర్ఏలు సీఎం ఫాంహౌజ్ లో వాటా అడిగారా?ప్రగతి భవన్ లో రూం అడిగారా?మండిపడ్డ బండి సంజయ్!

హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మహిళా వీఆర్ఏలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 79 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఆడబిడ్డలను నిర్బంధించి తన క్రూరమైన మనస్తత్వాన్ని చాటుకుందన్నారు.

వీఆర్ఎలది న్యాయమైన డిమాండ్..

వీఆర్ఎలది న్యాయమైన డిమాండ్..

అంతే కాకుండా సమ్మె కాలంలో జరిగిన 50 మందికి పైగా వీఆర్ఏల మరణాలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాద్యత అన్నారు బండి సంజయ్. మహిళా వీఆర్ఏలను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం దుర్మార్గమని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. బతుకమ్మతో ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగితే అరెస్ట్ చేస్తారా? అని నిలదీసారు.

 మహిళలపై లాఠీ ఛార్జ్ అమానుషం..

మహిళలపై లాఠీ ఛార్జ్ అమానుషం..

తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తోందన్నారు. వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందేనన్నారు బండి సంజయ్. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధ్రుతం చేస్తామని బండి సంజయ్ కుమార్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన వీఆర్ఏలను పిలిపించుకుని నాలుగు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.

 తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఎలది కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఎలది కీలక పాత్ర..

దమ్ముంటే సీఎం చంద్రశేఖర్ రావు గాని, మంత్రులు గానీ ఇందిరాపార్క్ వద్దకొచ్చి వీఆర్ఎలకు సమాధానం చెప్పాల్సి ఉండేదని, అందుకు భిన్నంగా అరెస్టులు, లాఠీఛార్జీలు చేస్తూ అరాచకం సృష్టించడం దారుణమన్నారు బండి సంజయ్. బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతుంటే లాఠీచార్జ్ చేస్తూ అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లె నుండి పట్నం దాకా ప్రతి చౌరస్తాలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన విషయాన్ని చంద్రశేఖర్ రావు కుటుంబం మరిచిపోయిందా? అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

 ఆందోళనను ఉధ్రుతం చేస్తాం..

ఆందోళనను ఉధ్రుతం చేస్తాం..

ఏరుదాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటాకా బోడ మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు అడుగుడుతుంటే దుర్మార్గంగా వ్యవహరించడం టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. వెంటనే వీఆర్ఏలను సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో వీఆర్ఏలతో కలిసి బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధ్రుతం చేస్తామని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+