వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ తో విబేధాలే వివాదానికి కారణమా? చిన్నజీయర్ వ్యాఖ్యల ఆంతర్యం అదేనా? కొత్త చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామి కి మధ్య చోటు చేసుకున్న విభేదాలే సమ్మక్క సారలమ్మలపై కొత్త రచ్చకు కారణం అయ్యాయా? సమ్మక్క సారలమ్మలను చులకన భావంతో మాట్లాడిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలతో కొనసాగుతున్న రగడకు మూలం అదేనా? తాజాగా చిన్న జీయర్ స్వామి కొంతమంది తాను 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి సొంత లాభం కోసం బయటకు విడుదల చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా? అన్న కొత్త చర్చ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది.

చిన్న జీయర్ కు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్

చిన్న జీయర్ కు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్

నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా చిన్న జీయర్ స్వామి పెట్టిన ముహూర్తానికి, ఆయన సూచనల మేరకు నిర్వహించారు. అయితే ఇటీవల చిన్న జీయర్ స్వామికి కెసిఆర్ కు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి అన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. గతంలో చిన్న జీయర్ స్వామి కి పెద్ద పీట వేసిన కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన హోమం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ఇలా అన్నిటికీ చిన్న జీయర్ స్వామి పెట్టిన ముహూర్తాలను ఖరారు చేసి, ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలను నిర్వహించారు.

సమతామూర్తి విగ్రహావిష్కరణ నుండి కేసీఆర్ కు చిన్నజీయర్ కు మధ్య గ్యాప్

సమతామూర్తి విగ్రహావిష్కరణ నుండి కేసీఆర్ కు చిన్నజీయర్ కు మధ్య గ్యాప్

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులన్నీ ముందు నుండి చిన్న జీయర్ స్వామి సలహాలు, సూచనల మేరకే నడిచాయి. ఇక యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం కూడా పెట్టిన చిన్న జీయర్ స్వామిని యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి పిలవలేదని సమాచారం. ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ దగ్గరనుండి సీఎం కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామికి మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తుంది.

ఎప్పుడో చిన్నజీయర్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో వైరల్, టీఆర్ఎస్ పనేనా?

ఎప్పుడో చిన్నజీయర్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో వైరల్, టీఆర్ఎస్ పనేనా?

ఇక ఈ విభేదాల నేపథ్యంలో తాజాగా గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమ్మక్క సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చిన్న జీయర్ స్వామి మాట్లాడినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నుంచి వైరల్ అయినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో సమ్మక్క సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చిన్నజీయర్ స్వామి పై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చిన్న జీయర్ స్వామి ఈ వ్యవహారం పై క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

కావాలని కొంతమంది తన వీడియోలను ఎడిట్ చేసారన్న చిన్నజీయర్.. ఎవరా కొందరు?

కావాలని కొంతమంది తన వీడియోలను ఎడిట్ చేసారన్న చిన్నజీయర్.. ఎవరా కొందరు?

సమ్మక్క సారలమ్మ లపై అనుచిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పిన చిన్న జీయర్ స్వామి కావాలని కొంతమంది తన వీడియోలను ఎడిట్ చేసి స్వప్రయోజనాల కోసం విడుదల చేస్తున్నారంటూ చెప్పడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని కలిగించింది. అసలు ఈ వివాదాన్ని ఎందుకు తెరమీదకు తీసుకువచ్చారు అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ కు సంబంధాలు బెడిసి కొట్టిన నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి పై ప్రచారం చేస్తున్న వారు ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

యాదాద్రి ఆలయానికి ఆహ్వానం అందలేదన్న చిన్న జీయర్... కేసీఆర్ తో గ్యాప్ పై జోరుగా చర్చ

యాదాద్రి ఆలయానికి ఆహ్వానం అందలేదన్న చిన్న జీయర్... కేసీఆర్ తో గ్యాప్ పై జోరుగా చర్చ

ఇక ఇదే సమయంలో యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని పేర్కొన్న చిన్న జీయర్ స్వామి పిలిస్తే వెళతానని లేకుంటే చూసి ఆనందిస్తాం అంటూ ప్రకటించారు. అంటే చిన్న జీయర్ స్వామి కి కెసిఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చకు చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఈ క్రమంలో సమ్మక్క సారలమ్మ ల పై చేసిన వ్యాఖ్యలను కావాలనే వివాదంగా మార్చారేమో అన్న చర్చ జరుగుతుంది.

ఏదేమైనా తాజా వివాదం నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి ఇచ్చిన క్లారిటీతో సమ్మక్క సారలమ్మ ల పై చోటుచేసుకున్న వివాదం సద్దు మణుగుతుందా? కెసిఆర్ చిన్నజీయర్ స్వామి ని యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ఆహ్వానిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
In the wake of the controversy over the remarks on Medaram Sammakka Saralammala, the debate over whether the differences with KCR are the cause of the controversy is raging. The comments made by Chinnajir also create curiosity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X