జగన్ , కేసీఆర్ ల మధ్య ఆ ఆస్తుల పంచాయితీ .... స్నేహ బంధం అందుకే తెగిపోయిందా ? ఆసక్తికర చర్చ
Recommended Video
తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ చాలా పెరిగిందని తాజా పరిణామాలు తేల్చి చెప్తున్నాయి . వారిరువురి మధ్య దూరం పెరిగినట్లు అధికార వర్గాలలోనూ చర్చ సాగుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఆర్టీసీ విలీనం చిచ్చు పెట్టిందని భావిస్తే అందులోనూ ఆస్తుల పంచాయితీ కారణం అని తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంచాయితీ
నిన్నా మొన్నటి దాకా ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు స్నేహగీతం పాడారు. ఫ్రెండ్ అంటే నువ్వే అంటూ మీడియా ముందు సందడి చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్దే ధ్యేయం అని తెగ మంతనాలు జరిపారు. కానీ ఏపీలో ఆర్టీసీ విలీనం వల్ల తెలంగాణలో ఏర్పడిన పరిస్థితి సీఎం కేసీఆర్ కు చికాకును తెప్పించింది. ఏపీలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రస్తావించి ఘాటుగా తనదైన శైలిలో మాట్లాడారు సీఎం కేసీఆర్ . ఇక సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రికి రుచించలేదు.సాధ్యమైనంత దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్టీసీ ఆస్తుల కోసమే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను టార్గెట్ చేశాయి.

ఇప్పటివరకు విభజన జరిగి ఆరేళ్ళు అయినా పూర్తికాని ఆస్తుల పంపకాలు
ఆర్టీసీని విలీనంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అటుంచి ఇక ఆర్టీసీ ఆస్తుల పంచాయితీనే అసలు జగన్మోహన్ రెడ్డికి, సీఎం కేసీఆర్ కు మధ్య అగాధాన్ని పెంచిందని చర్చ జరుగుతుంది.
రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు కావొస్తున్నా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఇప్పటివరకూ ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తి కాలేదు. ఏపీఎస్ ఆర్టీసీకే గుర్తింపు ఉంది కానీ టీఎస్ ఆర్టీసీకి గుర్తింపు లేదన్న విషయం కూడా ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలోనే బయటకు వచ్చింది .

విభజన లెక్కల ప్రకారం 58-42 నిష్పత్తిలో పంచుకోవాలన్న కేంద్రం
అయితే ఇంతకాలం ఒక అవగాహనతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు పని చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆర్టీసీకి హైదరాబాద్ లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. భవనాలు, ఖాళీ స్థలాలు లాంటివి వివిధ రూపాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. విభజన లెక్కల ప్రకారం 58-42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆ పని జరగలేదు. పైపెచ్చు సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను పంపకాలు జరగకుండానే లీజుకు ఇస్తున్న ఉదంతాలు బయటకు వచ్చాయి.

రూ.16వేల కోట్ల ఆస్తులు తమకు రావాలంటున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ, తెలంగాణా వాటాల లెక్కల్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఆర్టీసీకి చెందిన మొత్తం ఆస్తులు అంచనా ప్రకారం రూ.35వేల కోట్లు. ఆ ఆస్తుల్లో రూ.16వేల కోట్ల ఆస్తులు తమకు చెందాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ లో ఆర్టీసీకి 11 ప్రధానమైన చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భవనాలు, స్థలాల రూపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంది.

కేవలం బస్ భవన్ షేర్ మాత్రమే ఇస్తామన్న తెలంగాణా సర్కార్
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ షేర్ మాత్రమే ఇస్తామని మరింకేమీ ఏపీకి ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది . ఈ భవనాన్నినిర్మించినప్పుడు దీని విలువ రూ.76 కోట్లు. దాన్లో వాటా ఇస్తాం తప్పించి మిగిలిన ఆస్తుల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటోంది తెలంగాణా సర్కార్ . ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదంగా మారి తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య దూరం పెంచిందని ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఆర్టీసీ ఆస్తుల పంచాయితీతో పెరిగిన మరింత అగాధం
అయితే ఏపీ ఆర్టీసీ కి చెందిన ఆస్తులను విభజన లెక్కల ప్రకారం అప్పగించాలని ఏపీ సర్కార్ , బస్ భవన్ లో వాటా మినహాయించి ఇంకేం ఇవ్వమని తెలంగాణా సర్కార్ ప్రస్తుతం తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఈ ఆస్తుల పంచాయితీతోనే ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య స్నేహం దెబ్బతిన్నట్లుగా తాజా చర్చ జరుగుతుంది. అసలే అప్పుల రాష్ట్రం , అందులోనూ ఆర్తీసీనీ ఆదుకోవటం కోసం కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రం అయిన ఏపీ, తెలంగాణలో ఉన్న తమ ఆస్తులను దక్కించుకుంటే కొంత ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేసినట్టు అవుతుందని భావిస్తుంది.

ఇద్దరూ ఇద్దరే ... ఆర్టీసీ ఆస్తుల విషయంలో ఏం చేస్తారో ?
సీఎం కేసీఆర్ ఆస్తుల పంపకానికి ససేమిరా అంటున్నారు. ఈ పంచాయితీ తెగకుంటే సీఎం జగన్ కూడా అంత సులువుగా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టరు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తుతం ఏర్పడిన విభేదాలకు ఆస్తుల పంచాయితీ మరోసారి ఆర్జ్యం పోసినట్టు అయ్యింది. ఈ ఆస్తుల పంచాయితీతో భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications