వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్లోల కాంగ్రెస్.!దిగ్విజయ్ రంగ ప్రవేశం.!టీపీసిసి వివాదం టీ కప్పులో తుపాను కానుందా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసమ్మతి గళం విపిపిస్తున్నారు. పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏకపక్షంగా ఉందని, సీనియర్ల మనోభావాలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల ఏఐసీసీ పీసిసి సంయుక్తంగా విడుదల చేసిన జంబో పదవుల జాబితా కూడా ఆమోదయోగ్యంగా లేదంటున్నారు సీనియర్ నేతలు. ఇదే అంశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భేటీ ఐన సీనియర్ నాయకులు పంచాయితీని ఢిల్లీ అధిష్టానం దగ్గర తేల్చుకోవాలని నిర్ణయించారు.

 కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు..

కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు..

ఇందుకోసం మంగళవారం మరొక్కసారి సమావేశం నిర్వహించుకుని తుది అభ్యంతరాలతో నివేదికను రూపొందించి కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచాలనేది సీనియర్ల వ్యూహంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత వారం గత వారం భట్టి విక్రమార్క నివాసంలో చెలరేగిన అసమ్మతి గళం గురించి తెలుసుకున్న అదిష్టానం వేగంగా స్పందించింది. సహజంగా ఇలాంటి అంతర్గత విభేదాలు చెలరేగినప్పుడు అధిష్టానం అంతగా స్పందించదు. కాలంతో పాటు కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయని సంయమనంగా వ్యవహరిస్తుంది ఏఐసీసీ.

సీనియర్లందరితో మాట్లాడనున్న దిగ్విజయ్..

సీనియర్లందరితో మాట్లాడనున్న దిగ్విజయ్..


కానీ అలాంటి సంప్రదాయానికి పూర్తి విరుద్దంగా వ్యవహరించింది ఏఐసీసీ. తెలంగాణ సీనియర్లలో చెలరేగిన అసంతృప్తికి గల కారణాలను క్షుణ్నంగా తెలుసుకునేందుకు పార్టీ సీనియన్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా పని చేసిన దిగ్విజయ్ సింగ్ ను పంచాయితీ పెద్దగా తెలంగాణకు పంపించింది అదిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గతంలో సుధీర్గకాలం పని చేసిన అనుభవం ఉన్న దిగ్వజయ్ సింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతల నాడి బాగా తెలుసనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీపిసిసి సీనియర్ నేతలందరూ దిగ్విజయ్ కి సహకరిస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

స్వరం మార్చుకున్న భట్టి..

స్వరం మార్చుకున్న భట్టి..

తెలంగాణ పీసిసి విడుదల చేసిన జంబో పదవుల జాబితాలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కాదని వలస వచ్చిన నేతలకు పదవులు కట్ట బెట్టారని సీనియర్లు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంలో పీసిసి అద్యక్షడుగా ఉన్నా రేవంత్ రెడ్డి తన అనుయాయులకు ఎక్కువ సంఖ్యలో పదవులు కట్టబెట్టి, ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను మోసిన ఒరిజినల్ నాయకులకు అన్యాయం చేసారన్నది సీనియర్ల ఆరోపణ. ఇవే అరోపణలలతో పార్టీలోని సీనియర్లందరూ ఆమోదాన్ని తెలుపుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

దిగ్విజయ్ కి ఫిర్యాదు చేస్తారా.?

దిగ్విజయ్ కి ఫిర్యాదు చేస్తారా.?


సరిగా ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం స్పందించి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ వ్యవహారాలపై తాజా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. దీంతో తెలంగాణ నేతల మనోభావాలు బాగా తెలిసిన దిగ్విజయ్ హైదరాబాద్ చేరుకున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతతో విడివిడిగా, ఒంటరిగా సమావేశం కానున్నారు దిగ్వజయ్. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోదండ రెడ్డి, మహేష్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్ తదితర నేతలతో దిగ్విజయ్ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. కాగా దిగ్విజయ్ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం భట్టి నివాసంలో మరోసారి జరగాల్సిన సమావేశాన్ని సీనియర్లు వాయిదా వేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ కు రేవంత్ గురించి వ్యతిరేక గళం వినిపిస్తారా లేక మొత్తం ఎపిసోడ్ పట్ల సైలెంట్ గా ఉంటూ టీకప్పులో తుపానుగా మార్చేస్తారా చూడాలి.

English summary
Congress High command has sent Digvijay Singh, the senior party leader and in-charge of Telangana Congress affairs, to Telangana as the despute chief to find out the reasons for the discontent among Telangana seniors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X