ఏపీకి జరిగిందే తెలంగాణకు జరిగితే: డిగ్గీపై ఆగ్రహం, జగన్‌పై కాల్వ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచివారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి రానిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ బూర్లగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచివారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి రానిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ బూర్లగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇదే అన్యాయం తెలంగాణకు జరిగి ఉంటే దిగ్విజయ్‌ను హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేవారు కాదన్నారు. ప్రత్యేక హోదా ముసుగులో ఏపీకి ద్రోహం చేయాలని చూస్తున్నారన్నారు.

ఏపీకి చుట్టపుచూపుగా జగన్: కాల్వ
బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏపీకి చుట్టపుచూపుగా వస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనకాపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాజ్ భవన్ సాక్షిగా ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అన్నందుకే, తన పార్టీలోని ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారన్నారు. ప్రగతి విధ్వంసకర శక్తిగా వైసిపి మారిందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. విశాఖపట్టణం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications