వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటర్ గ్రిడ్ స్కాం: కేటీఆర్ కౌంటర్, డిగ్గీ ఫైర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణల పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీయే పెద్ద స్కాం పార్టీ అన్నారు. వాటర్ గ్రిడ్ పైన డిగ్గీ ఆరోపణలు అవాస్తవమన్నారు. పైపులు వేయకుండా కాంగ్రెస్ పార్టీ నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వేసిన పైపులకు కమీషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాగా, వాటర్ గ్రిడ్ భారీ స్కాం అని డిగ్గీ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో సభ్యత్వ నమోదు విషయమై పార్టీ నేతల పైన గురువారం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చేతకాని వాళ్లకు పదవులు ఎందుకని, నేతలు గాంధీ భవన్లో కాకుండా గ్రామాల్లో కనిపించాలని సూచించారు. ఓడిన వారికి మండలి టిక్కెట్ ఇవ్వమని చెప్పారు. అధికారం కోల్పోయినా కొందరు నేతలు హడావుడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. తెరాస ప్రభుత్వం ప్రచారానికి అలవాటుపడిందన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు దశ దిశ లేవన్నారు. ఇది ఒక పెద్ద స్కాం అన్నారు. కేవలం పైపుల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు మాత్రమే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.

ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి విభజన చట్టంలో ఉన్నాయన్నారు. ఈ హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విభజన చట్టం అమలులో విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏపీసీసీ కోటి సంతకాలతో ఉద్యమం చేపట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

ఈ నెల 19వ తేదీన ఎన్డీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో తలపెట్టనున్న కిసాన్ ర్యాలీలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

రాహుల్ తమ పార్టీ అగ్ర నేత అని, భవిష్యత్తులో పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. భూసేకరణ చట్టం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ తెచ్చిందన్నారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులకు హానీ చేసే అంశాలను ఈ చట్టంలో చేర్చిందన్నారు. ఆర్డినెన్సు జారీ చేసే ముందు ఎటువంటి చర్చ జరగకుండా బీజేపీ తొందరపడుతోందన్నారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

2013లో భూసేకరణ చట్టం పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం పొందిందన్నారు. వాటిని సవరించాల్సిన అవసరం లేదన్నారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో సభ్యత్వ నమోదు విషయమై పార్టీ నేతల పైన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చేతకాని వాళ్లకు పదవులు ఎందుకని, నేతలు గాంధీ భవన్లో కాకుండా గ్రామాల్లో కనిపించాలని సూచించారు.

 దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

ఓడిన వారికి మండలి టిక్కెట్ ఇవ్వమని చెప్పారు. అధికారం కోల్పోయినా కొందరు నేతలు హడావుడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Congress leader Digvijay Singh flays KCR for unkept promises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X