కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలంటూ మండిపడ్డ దిగ్విజయ్ (ఫోటోలు)
హైదరాబాద్: కేంద్రంలో పెద్ద మోడీ, రాష్ట్రంలో చిన్న మోడీ (కేసీఆర్) ఇద్దరూ ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి పదవుల్లో కొనసాగుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో ప్రచారం నిర్వహించారు.
ఏఎస్‌రావ్‌నగర్, మల్కాజిగిరి, బౌద్ధనగర్‌లో పాదయాద్రలు, ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆనాడు టీఆర్‌ఎ్‌సకు రెండు ఎంపీ స్థానాలే ఉన్నాయని, కాంగ్రెస్ చొరవతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
నేడు గ్రేటర్ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు లభించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పునాదే కారణమన్నారు. టీఆర్‌ఎస్ తన 20 నెలల పాలనలో పేదలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
ఎన్నికలకు ముందు ఆంధ్రావాలా భాగో అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాటమారుస్తున్నారన్నారు. ఇక బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తోందన్నారు. బీజేపీ, ఎంఐఎంలకు తమ స్వప్రయోజనం తప్ప తమ వర్గ ప్రజల గురించి ఏమాత్రం పట్టదని అన్నారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే తీరికా కేసీఆర్‌కు లేదని, తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం పరామర్శించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేత, ఎపీ సీఎం చంద్రబాబునాయుడు ఇపుడు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లడగడం విచారకరమన్నారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
ఈ మోసపూరిత పార్టీలతో లాభం లేదని, కాంగ్రెస్ పార్టీతో నే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులనే ఆదరించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. కాగా, దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పేదల కోసం పాటుపడితే ఆయన కుమారులు ఒవైసీ సోదరులు ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
పాతబస్తీలో రోడ్‌షోలో ఆయన ఉత్తమ్‌తో కలిసి మాట్లాడారు. ఇస్లాం మతం ప్రమాదంలో ఉందని ముస్లింలను రెచ్చగొడుతూ వారి అభివృద్ధినే మరచిపోయారన్నారు. హైదరాబాద్ నగరం హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనమని, నిజాంలు అన్ని మతాలు, కులాలను గౌరవంగా చూశారని పేర్కొన్నారు.

కేసీఆర్‌వి ఆచరణ సాధ్యం కాని హామీలు: గ్రేటర్ ప్రచారంలో దిగ్విజయ్
దేశంలో పట్టుబడ్డ ఉగ్రవాదులందరూ ముస్లింలేనంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సంఘ్‌పరివార్ కూడా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లౌకిక విలువలకు కట్టుబడింది కేవలం కాంగ్రెస్ మాత్రమేనన్నారు.












Click it and Unblock the Notifications