దిగ్విజయ్‌కు అధిష్టానం షాక్: తెలంగాణ ఇంచార్జిగా కుంతియా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను తొలగించారు.ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను తొలగించారు. ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
ఇటీవల ఆయన కొన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ పోలీసులపై, డ్రగ్స్ వ్యవహారంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.
తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత డ్రగ్ కేసుపై ట్వీట్ చేస్తూ తెరాస నేతల హస్తం ఉందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications