వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పు పక్కానే; తెలంగాణా కాంగ్రెస్ పై అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ నివేదికతో పార్టీలో ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చోటుచేసుకున్న అంతర్గత కలహాల పై తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పార్టీ నేతలతో మాట్లాడి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల గురించి కీలక నివేదికను అందించారు. ఇక దిగ్విజయ్ సింగ్ నివేదికతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో కలవరం మొదలైంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన కలుగుతుంది.

 తెలంగాణా కాంగ్రెస్ పంచాయితీ కోసం వచ్చిన దిగ్విజయ్ సింగ్

తెలంగాణా కాంగ్రెస్ పంచాయితీ కోసం వచ్చిన దిగ్విజయ్ సింగ్

తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా విమర్శలకు దిగారు. రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ల తీరుతో ఒక్కసారిగా దిగ్విజయ్ సింగ్ ను హుటాహుటిగా హైకమాండ్ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణకు వెళ్లాల్సిందిగా సూచించింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి పని చేసుకోవాలని, సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదని చెప్పి వెళ్ళారు.

 మాణిక్కం ఠాగూర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ సీనియర్లు

మాణిక్కం ఠాగూర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ సీనియర్లు


దిగ్విజయ్ సింగ్ రాక నేపధ్యంలో సీనియర్ నేతలు అందరూ ముక్తకంఠంతో పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపై దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వారు, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా మాణిక్కం ఠాగూర్ ను టార్గెట్ చేశారు. ఆయన ఏకపక్ష వైఖరి వల్లే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని వారు పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమన్వయం చేసుకోలేకపోతున్నారు అని విమర్శించారు.

హైకమాండ్ కు నివేదిక ఇచ్చిన దిగ్విజయ్ సింగ్ .. సీరియస్ గా హై కమాండ్

హైకమాండ్ కు నివేదిక ఇచ్చిన దిగ్విజయ్ సింగ్ .. సీరియస్ గా హై కమాండ్

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించడం కోసం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించిన క్రమంలో, దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్రంలో నేతలందరితో మాట్లాడిన క్రమంలో తాను స్టడీ చేసిన అనేక అంశాలను పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు నివేదికను సమర్పించారు. ఇక దిగ్విజయ్ సింగ్ సమర్పించిన నివేదికలో రేవంత్ రెడ్డి కంటే మాణిక్కం ఠాగూర్ పైన ఎక్కువ ఫిర్యాదులు ఉండటంతో ఆయనను మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 మాణిక్కం ఠాగూర్ స్థానంలో ఎవరు?

మాణిక్కం ఠాగూర్ స్థానంలో ఎవరు?


అయితే మాణిక్కం ఠాగూర్ స్థానంలో ఎవరికి పట్టం కట్టాలన్న దానిపైన, ఎవరిని పంపిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించ గలుగుతారు అన్న దానిపైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రియాంక గాంధీని రాష్ట్ర ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని కొందరు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో హర్యానాకు చెందిన పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా పేరుకూడా ప్రధానంగా వినిపిస్తుంది. ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన కూడా పార్టీని గాడిలో పెట్టడంలో కీలకంగా పని చేస్తారని భావన వ్యక్తమవుతోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలను పరిష్కరించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎవరిని తెలంగాణాకు పంపిస్తుందో వేచి చూడాల్సిందే.

English summary
With the report of Digvijay Singh to the high command, tremors started in the telangana congress. It is reported that the management is also thinking of changing Manikkam Tagore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X