రాజకీయాల్లోకి దిల్ రాజు? పార్టీ, నియోజకవర్గం అవే??
రాజకీయం అనేది చలనచిత్ర ప్రముఖులను ఎప్పుడూ ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే అప్పటికే వారికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఈ ఆదరణ ఎన్నికల్లో గెలుపొందడానికి అదనపు అర్హతగా ఉపయోగపడుతుందని భావిస్తారు. చలనచిత్ర రంగంలో ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న తర్వాత ఇంకా మనం సాధించాల్సింది ఏమైనా ఉందా? అనే ప్రశ్న విజయవంతమైన వ్యక్తుల్లో అంకురిస్తుంది. అప్పుడు వారి ఆలోచన, వారి చూపు రాజకీయాలవైపు పడుతుంది. శాసనసభ కావచ్చు.. శాసనమండలి కావచ్చు.. రాజ్యసభ కావచ్చు.. లోక్‌సభ కావచ్చు.. ఏదన్నా కానీ రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకోవాలనే కోరిక జనియిస్తుంది. ఎమ్మెల్యేనో, మంత్రో, ఎంపీనో అవడమే అంతిమ లక్ష్యాన్ని ఎంచుకుంటారు.
తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. వాస్తవానికి ఇది కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీచేయాలని దిల్ రాజు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. తర్వాత ఏమైందోకానీ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.

విజయవంతమైన నిర్మాతగా, పంపిణీదారుడిగా పేరు గడించిన దిల్ రాజు సక్సెస్ రేట్ చాలా పెద్దది. ఇప్పుడు ఆయన చూపు రాబోయే ఎన్నికలపై పడింది. నిజామాబాద్ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అక్కడి స్థానికులకు దగ్గరయ్యారు. సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి ఎన్నికల్లో పోటీ కూడా అక్కడినుంచే ఉండబోతోంది. ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? ఎంపీగా పోటీచేస్తారా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే పార్టీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితే కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనమండలి, రాజ్యసభ లాంటివి కాకుండా నేరుగా ప్రజల మధ్యే పోటీచేసి ఎమ్మెల్యేగాకానీ, ఎంపీగాకానీ ఎన్నికవ్వాలనేది దిల్ రాజు ఆలోచన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications