తెలంగాణాను అవమానించిన దిల్ రాజు.. షాకింగ్ వ్యాఖ్యల వీడియో వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కారణంగా మారాయి.

సంక్రాంతికి వస్తున్నాం .. సినిమా ప్రమోషన్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

dil raju insulted telangana his shocking comments viral in social media

తెలంగాణాపై దిల్ రాజు షాకింగ్ వ్యాఖ్యలు
ఇక ఈవెంట్లో నిజామాబాద్ లో మాట్లాడిన ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపి ఆసక్తిని గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని తను డైరెక్టర్ కి చెప్పానని, అదే ఆంధ్రకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారని దిల్ రాజు పేర్కొన్నారు. నిజామాబాద్ లో తెల్ల కల్లు, మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారని వ్యాఖ్యలు చేశారు.

దిల్ రాజు తెలంగాణాను అవమానించారని అభిప్రాయం
ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే మన దగ్గర మాత్రం తెల్ల కల్లు, మటన్ కు వైబ్ ఇస్తామని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక దిల్ రాజు తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు తినడానికి, తాగడానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తారని వేదిక మీద చెప్పిన దిల్ రాజు తెలంగాణను అవమానించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు వ్యాఖ్యలపై ఆగ్రహం
ఇక సినిమాలను ఆదరించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆదరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినిమాలంటే వైబ్ ఉంటుందని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో మండిపడుతున్నారు. సినిమాలు ఏవైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ చూసి ఆదరిస్తేనే సక్సెస్ అవుతున్నాయని అటువంటిది తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కు ప్రాధాన్యతను ఇస్తారని చెప్పడం తెలంగాణ కల్చర్ ను అవమానించడమేనని కొందరు దిల్ రాజు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+