Rajamouli: అమిత్ షాను కలవనున్న దర్శకుడు రాజమౌళి.. ఎందుకంటే..!
తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అధిష్ఠానం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. అమిత్ షా బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు.
హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షాను ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలవనున్నారు. వీరు సమావేశం అవుతారన్న వార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలను ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కూడా అమిత్ షాను కలుస్తుండడం ఆసక్తిగా మారింది.

అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 14న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 15 తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలంకు వెళ్తారు. మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు సీతారాములను దర్శించుకుంటారు.
అనంతరం ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.












Click it and Unblock the Notifications