రేవంత్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి: కాంగ్రెస్ వైఖరిపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సుదీర్ఘ లేఖ రాశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి భాషపై కాంగ్రెస్ అధిష్టానం అభ్యంతరం చెప్పకపోవడంపై హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. రాహుల్ గాంధీని టెర్ర‌రిస్ట్ అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించిన కాంగ్రెస్.. కేసీఆర్‌పై రేవంత్ భాష‌ను క‌ట్ట‌డి చేయ‌క‌పోవ‌డంపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Disciplinary action should be taken against Revanth Reddy Harish Rao s letter to Kharge

ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని విమర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. రేవంత్ భాష‌ను ప్రోత్స‌హిస్తున్న కాంగ్రెస్ హైక‌మాండ్‌కు బీజేపీ వ్యాఖ్య‌ల‌ను ఖండించే నైతిక హ‌క్కు కూడా లేద‌న్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని హరీశ్ రావు విమర్శించారు. పోలీసులు సీఎం రేవంత్‌కు కీలుబొమ్మ‌లుగా మారి నియంతృత్వ పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారన్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెడుతున్నారు. సీఎం అనుచ‌రులు నేరాల‌కు పాల్ప‌డినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని మండిపడ్డారు.

హ‌మీల‌పై నిల‌దీస్తే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు ప‌ట్ల కాంగ్రెస్ అధిష్టానం మౌనం దుర‌దృష్ట‌క‌రం. తెలంగాణ‌లోని ప‌రిస్థితి మ‌హాభార‌తాన్ని గుర్తు చేస్తోంది. ధృత‌రాష్ట్రుడు త‌న కొడుకు దుర్యోధ‌నుడి క్రూర‌మైన అతిక్ర‌మ‌ణ‌ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా విస్మ‌రించిన‌ట్టు కాంగ్రెస్ అధిష్టానం తీరు ఉందని హ‌రీశ్‌రావు దుయ్యబట్టారు. రేవంత్ భాషను కట్టడి చేయాలని కాంగ్రెస్ అధిష్టానానికి మరోసారి స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+