Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుంటూరుకు కోమటిరెడ్డి బ్రదర్..! జగన్ తో భేటీ, పార్టీ మార్పుపై క్లారిటీ..!

మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉంటూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..ఈ క్రమంలో పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగుతోంది. అదే సమయంలో ఆయన ఇవాళ గుంటూరుకు వస్తున్నారు. దీంతో ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తనపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను పుకార్లను రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొన్ని చానల్లో సోషల్ మీడియాలో నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తినే విధంగా తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించిందే తానని, కానీ అందులో అవినీతి లేదని తాను చెప్పినట్లు ఓ పత్రికలో కథనం ప్రచురించడంపై ఫైర్ అయ్యారు.

disgruntled T congress mla komatireddy Rajagopal clarified to party change meeting ys jagan

తనకు మంత్రి పదవి రానందుకు రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన తాను అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలను సృష్టించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన పైన వచ్చే తప్పుడు వార్తలను అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్నా.. సోనియా గాంధీ అన్నా.. రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానం అన్నారు.
తమ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అన్నారు.

తాను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారని రాజగోపాల్ ఆరోపించారు. కొందరు గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతీయడానికి సోషల్ మీడియా ద్వారా అవస్తవాలు పుకార్లు ప్రచారం చేస్తున్నారన్నారు. దయచేసి తెలంగాణ సమాజం పుకార్లను నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా బహిర్గతంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని వేదికల్లో చెప్పడం జరిగిందన్నారు.

disgruntled T congress mla komatireddy Rajagopal clarified to party change meeting ys jagan

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భూ నిర్వాసితుల విషయంలో కూడా తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయం చెప్పానన్నారు. ఇవాళ కూడా తాను గుంటూరు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తుంటే.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డని కలవడానికి వెళ్తున్నాడని పుకార్లు సృష్టిస్తున్నారన్నారు.

disgruntled T congress mla komatireddy Rajagopal clarified to party change meeting ys jagan

తాను గుంటూరు వెళుతున్నాను అంటే మా నియోజకవర్గంలో నుంచి కూడా కొంతమంది నాయకులు తనతో వస్తా అన్నారని ఆయన తెలిపారు. తాను అనుచరులతో కలిసి గుంటూరులో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అటు నుండి విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామన్నారు. దానికీ, తాను జగన్ ని కలవడానికి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తన రాజకీయం గురించి, తన భవిష్యత్తు గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతాను తప్ప అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+