Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను ఎన్కౌంటర్ చేయడాన్నిసమర్ధించారు. దేశం మొత్తం దృష్టి పెట్టిన ఈ ఘటన త్వరలో సినిమాగా రాబోతుంది. ఇక ఈ ఘటన సన్నివేశాన్ని సినిమాలో తియ్యాలని నిర్ణయం తీసుకున్నారు ఓ దర్శకుడు . అందుకు కారణం కూడా లేకపోలేదు.

బోయపాటి సినిమాలో దిశ హత్యోదంతం
దిశ సంఘటన త్వరలోనే తన సినిమాలో రూపొందించబోతున్నారట బోయపాటి శ్రీనివాస్ . సామాజిక న్యాయం, ఎమోషన్, ఎంటర్ టైన్‌మెంట్ వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ తీస్తున్న ఆయన సినిమాలో దిశ ఉదంతం ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి కథ, స్క్రిప్టు రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక బోయపాటి శ్రీను ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఆయన నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రం డిసెంబర్ 6న ప్రారంభం కావటం , అదే రోజున దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యటం జరిగింది. దీంతో ఇక తాజా బాలయ్య చిత్రంలో దిశ ఘటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

దిశఘటన , ఎన్ కౌంటర్ పై ఉద్వేగంగా స్పందించిన బాలయ్య , బోయపాటి శ్రీనివాస్ లు
బోయపాటి, బాలయ్యల కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఈ సందర్భంగా బాలకృష్ణ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీరియస్‌గా స్పందించారు.ఇక హిందూపురం ఎమ్మెల్యే,సినీ హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. సమాజాన్ని మార్చడానికి అప్పట్లో తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇచ్చారని బాలయ్య పేర్కొన్నారు.

సందేశాత్మక సినిమాలు తీసిన బోయపాటి .. దిశ ఉదంతం సినిమాలో ఉండేలా ప్లాన్
మరోమారు ఎవరూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా, అసలు అటువంటి ఆలోచనే రానివ్వకుండా అందరికీ ఇదొక గుణపాఠం కావాలంటూ బాలయ్య మాట్లాడారు. దాంతో ఈ చిత్రంలో ఇలాంటి ఓ ఎపిసోడ్ పెట్టాలని బోయపాటి కూడా ప్లాన్ చేస్తున్నాడన్నది సమాచారం. దిశ కేసులో ఆమెపై జరిగిన దారుణం , ఆ తర్వాత పోలీసులు నిందితులను కాల్చి చంపటం వరకు అన్ని తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు .

సినిమాలో దిశ ఘటన సీన్ లో ఎన్ కౌంటర్ చేసేది బాలయ్యనేనా ?
అమ్మాయిలపై జరుగుతున్న దారుణలను ఆధారంగా చేసుకునే గతంలోనూ బోయపాటి తన సినిమాల్లో చాలా సన్నివేశాలు చూపించారు .సింహా , లెజెండ్ సినిమాల్లో బాలయ్య మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పారు. ఇక వాటికి థియేటర్ల లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఇదే తరహాలో దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో వారిని ఎన్ కౌంటర్ చేసే పాత్రలో ఎవరు నటిస్తారు.. బాలయ్య ఆ సీన్ లో కనిపిస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications