చిట్టీల వివాదం: ఒక మహిళ గొంతు కోసి.. భయంతో మరో మహిళ ఆత్మహత్య!

Posted By:
Subscribe to Oneindia Telugu

సంగారెడ్డి: చిట్టీల విషయంలో రేగిన వివాదం ప్రాణాల మీదికి తెచ్చింది. ఆవేశం పట్టలేక ఓ మహిళ మరో మహిళ గొంతు కోసేసింది. ఆ తరువాత భయపడి తను కూడా ఇంట్లోకి వెళ్లి ఊరేసుకుంది.

కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌లోని 321 క్వార్టర్‌లో అనిత, హిమసుధలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఇరువురి భర్తలు కూడా బీడీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

Disputes in Chit Business, Woman slit her friend's throat and committed suicide

ఈ మధ్యన అనిత, హిమసుధలు చిట్టీల వ్యాపారంలోకి దిగారు. చిట్టీల విషయంలోనే వారిరువురి మధ్య గొడవ జరిగింది. హిమసుధ ఆవేశం పట్టలేక అనిత గొంతు కోసి మట్టుబెట్టేయత్నానికి పాల్పడింది. తీరా చేశాక భయపడిపోయింది.

తన క్వార్టర్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనితను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భానూరు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anita and Himasudha are friends. They are residing in side by side houses of quarter 321 of BDL Township. Their husbands are working in BDL. Recently these two women started chits business. They quarrel on each other regading their business. Himasudha un control her angry and she slit Anita's throat. After that she feared very much and she went into her quarter and committed suicide. Now Anita was taking treatment in a nearby hospital. Doctors told that she is out of danger. Local police filed a case against this incident and investigating further.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి