టీఆర్ఎస్ లో ఎందుకీ అసమ్మతి గళాలు .. బుజ్జగింపు డ్రామాలు .. ఉనికి కోసమేనా ?

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా తమ నిరసన గళాన్ని ఎందుకు వినిపిస్తున్నారు? మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కకపోవడంతో తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించకుంటే ఉనికిని కోల్పోతామనే భయం పార్టీ నేతలకు పట్టుకుందా? అందుకే అసమ్మతి గళాలు.. బుజ్జగింపు డ్రామాలా ? అసలు టిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది.పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలు ఎందుకు సైలెంట్ అవుతున్నారు?

గులాబీ పార్టీలో అసమ్మతి గళాలు .. ఆపై పార్టీ మారే ఉద్దేశం లేదని వ్యాఖ్యలు

గులాబీ పార్టీలో అసమ్మతి గళాలు .. ఆపై పార్టీ మారే ఉద్దేశం లేదని వ్యాఖ్యలు

ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు గులాబీ బాస్ కెసిఆర్ పైన తమ నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీ వీడుతున్నట్లు గా లీక్ లు ఇస్తున్నారు. ఎవరికి వారు తామంటే తాము గులాబీ పార్టీ ఓనర్లమని చెప్పుకుంటున్నారు. ఈటెల రాజేందర్ నుండి మొదలైన ప్రస్థానం ఒకరొకరుగా నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇదంతా దేనికోసం, అధిష్టానాన్ని భయపెట్టడానికా, లేక ఉనికిని చాటుకోవడానికా అన్న ప్రశ్న తాజా పరిణామాలతో వ్యక్తమవుతోంది.

టిఆర్ఎస్ పార్టీ మీద ఘాటుగా విమర్శలు చేసిన నేతలెవరూ పార్టీ వీడి వెళ్లడానికి సిద్ధంగా లేరు. ఇక అంతే కాదు మొదట విమర్శలు గుప్పించి, తర్వాత మీడియా వక్రీకరించిందని మాట మారుస్తున్నారు. మేము అనలేదని చెప్తున్నారు.

 కేటీఆర్ బుజ్జగింపుల పర్వం .. కేసీఆర్ దేవుడంటూ చెప్తున్న నేతలు

కేటీఆర్ బుజ్జగింపుల పర్వం .. కేసీఆర్ దేవుడంటూ చెప్తున్న నేతలు

కెసిఆర్ తమకు దేవుడని, ఆయన ఆదేశానుసారం నడుచుకుంటామని మాటమార్చిన నేతలను కేటీఆర్ బుజ్జగించారు అని వినికిడి . ఇక తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసి మాట్లాడారు. అంతే కాకుండా బాహాటంగా టిఆర్ఎస్ పార్టీ పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎంపి అరవింద్ ను కలిసిన ఎమ్మెల్యే షకీల్ బిజెపిలో చేరుతున్నట్లు ఒక బలమైన సంకేతాలు ఇచ్చారు .దీంతో ఆయనపై టిఆర్ఎస్ అధినేత అనర్హత వేటు వేయడానికి రెడీ అయిందని వార్తలు కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి.

మాట మార్చిన షకీల్ .. కేసీఆర్ తన పొలిటికల్ గాఢ్ ఫాదర్ అంటూ కితాబు

మాట మార్చిన షకీల్ .. కేసీఆర్ తన పొలిటికల్ గాఢ్ ఫాదర్ అంటూ కితాబు

ఈ నేపథ్యంలో షకీల్ తాను పార్టీ మారడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి కెసిఆర్ కారణమని, చివరి వరకు పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గాఢ్ ఫాదర్ అంటూ ప్రకటించారు. అంతే కాదు స్వామి భక్తిని ప్రదర్శించి కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారు.రాష్ట్రంలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బీజేపీ ఎంపీ అర్వింద్ ను కలవటం రాజకీయ దుమారం రేపింది.

ఉనికి చాటుకునే యత్నం చేస్తున్న గులాబీ నేతలు .. గులాబీ బాస్ సీరియస్

ఉనికి చాటుకునే యత్నం చేస్తున్న గులాబీ నేతలు .. గులాబీ బాస్ సీరియస్

రెండుసార్లు గెలిచి.. ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా.. పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆయన మనస్సులో మాట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు షకీల్ . అది కాస్తా వైరల్ కావడంతో జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అధిష్ఠానం దూతలుగా పంపి షకీల్ ను బుజ్జగించిందని సమాచారం. దీంతో ఆయన తన మనస్సు మార్చుకుని పార్టీ మారే ప్రసక్తే లేదంటూ మాట మార్చారు. ఇది అధిష్టానం వద్ద ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప కాదని పార్టీ శ్రేణులలోనూ చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులను కట్టడి చేయాలని భావిస్తున్న కేసీఆర్, ఈ వరుస ఉదంతాలపై సీరియస్ గా ఉన్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+