పీఎం ధన్ ధాన్య యోజన పథకానికి తెలంగాణలో ఎంపికైన జిల్లాలు ఏవంటే..!

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం "పీఎం ధన్ ధాన్య యోజన" పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం, రైతుల ఆదాయం పెంపు, ఆత్మనిర్భార్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ పథకం తీసుకువస్తున్నారు.

పథకం ఉద్దేశం..

పీఎం ధన్ ధాన్య యోజన ద్వారా రైతులకు వ్యవసాయ శాస్త్రం, సాంకేతికత, పంటల నిర్వహణ, నిల్వ సాంకేతికత, మార్కెటింగ్ పద్ధతులు వంటి అంశాలపై అవగాహన కల్పించబడుతుంది. పథకం కింద రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమాలు, ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా సాంకేతిక మార్గదర్శకత్వం.. ప్రాక్టికల్ వర్క్‌షాప్‌లు, ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్లు నిర్వహించబడనున్నాయి. దీంతో రైతులు నూతన పద్ధతుల ద్వారా పంట దిగుబడులు పెంచుకొని, మార్కెట్‌లో ఎక్కువ ఆదాయం పొందే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

districts-in-telangana-selected-for-pm-dhan-dhanya-yojana-scheme

మొదటి దశలో 100 జిల్లాలు..

ఈ పథకాన్ని మొదటిగా దేశవ్యాప్తంగా 100 ఉత్పాదక వ్యవసాయ జిల్లాల్లో అమలు చేయనున్నారు. వీటిలో మట్టి, వాతావరణం, పంటల వైవిధ్యం, ఉత్పత్తి స్థాయిల ఆధారంగా జిల్లాలను ఎంపిక చేశారు.

తెలంగాణ..

  • జనగామ
  • నారాయణపేట
  • జోగులాంబ గద్వాల
  • నాగర్‌కర్నూల్

ఈ జిల్లాల్లోని రైతులకు మోడల్ ఫార్మ్‌ల రూపంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. పథకం సక్రమంగా అమలు కావడాన్ని నిర్ధారించేందుకు కేంద్రం ఇప్పటికే నోడల్ అధికారుల బృందంని నియమించింది. వీరు ప్రతి జిల్లాలో పథకం పురోగతిని పర్యవేక్షిస్తూ, రైతులతో నేరుగా సంభాషణ జరిపే విధానాన్ని అనుసరిస్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), ICAR, నాబార్డ్, మరియు సహకార సంస్థలుతో సమన్వయం కల్పించి పథకాన్ని సమగ్రంగా ముందుకు తీసుకువెళ్లనున్నారు.

పీఎం ధన్ ధాన్య యోజన ద్వారా రైతులు స్థానికంగా ఉత్పత్తి చేసుకునే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ ప్రొడక్షన్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు, రైతు కుటుంబాల ఆర్థిక స్థితి బలోపేతం చేయనుంది. ఈ పథకం పట్ల అన్నదాతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+