జూబ్లీహిల్స్ ఫైనల్ రిజల్ట్.. ఆ పార్టీదే విజయం.. డివిజన్లన్నీ క్లీన్ స్వీప్..

నెల రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగిన ప్రచారం.. మూడు పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి. ఎట్టకేలకు ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్​ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే ఈ ఫలితాల్లో దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని స్పష్టం చేశాయి. ఇక జూబ్లీహిల్స్ పై పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. డివిజన్ల వారీగా ఫలితాలను విశ్లేషించింది.

బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే సంస్థ వెల్లడించింది. ఇక ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్, యూసుఫ్ గూడ డివిజన్ లో కాంగ్రెస్, వెంగళ్ రావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్, రెహమత్ నగర్ లో కాంగ్రెస్, షేక్ పేటలో కాంగ్రెస్, సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసినట్లు ఈ సంస్థ వెల్లడించింది. జూబ్లీహిల్స్ లో 48.5 శాతం ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ కు 41.8 శాతం ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలిందని పేర్కొంది. ఇక బీజేపీకు 6.5 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది. మిగతా వారికి 3.2 శాతం ఓట్లు వచ్చినట్లు పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే సంస్థ అంచనా వేసింది.

అయితే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమై జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. అది అంత ఈజీగా వచ్చిన విజయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని.. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.

Division-Wise Drama Public Pulse Shows Congress Surge to 47 Overall in Jubilee Hills By-Poll

ఇక పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే సంస్థతోపాటు దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపాయి. చాణక్య స్టేటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు41 శాతం, బీజేపీకు 06 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. స్మార్ట్ పోల్ సంస్థ కాంగ్రెస్ 48.2 శాతం, బీఆర్ఎస్ కు 42.1 శాతం, బీజేపీకి 06 శాతం ఓట్లు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక నాగన్న సర్వే.. కాంగ్రెస్ కు 47 శాతం ఓట్లు.. బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ కు 08 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది. అటు జన్ మైన్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కుతుందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+