శివాజీ అనసూయ వివాదంలో దివ్వెల మాధురి ఎంట్రీ..ముదిరిన రచ్చ!
హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలదుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ పదాలు వాడానని, దానికి క్షమాపణలు శివాజీ చెప్పినప్పటికీ రచ్చ మాత్రం ఆగడం లేదు. శివాజీని టార్గెట్ చేసిన అనసూయ.. మీరు ఎవరు? మహిళలు ఈ బట్టలు వేసుకోవాలని చెప్పటానికి అంటూ నిలదీశారు. నా బాడీ నా ఇష్టం.. నా బాడీకి ఏది బాగుంటుంది అనిపిస్తే దానినే వేసుకుంటానని అనసూయ పేర్కొన్నారు.
శివాజీ వర్సెస్ అనసూయ.. దివ్వెల మాధురి ఎంట్రీ
ఆ తర్వాత శివాజీ అనసూయని ఉద్దేశించి తాను మాట్లాడలేదని చెప్పినప్పటికీ, మళ్లీ అనసూయ శివాజీని పదేపదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీ వ్యాఖ్యలకు స్పందించడం పైన ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎక్కువమంది సోషల్ మీడియాలో శివాజీకి మద్దతు తెలుపుతూ మహిళల వస్త్రధారణ గురించి చర్చ పెడుతున్నారు. ఇక తాజాగా శివాజీ అనసూయ వివాదంలో దివ్య మాధురి ఎంట్రీ ఇచ్చారు.

దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంతో దివ్వెల మాధురి హైలెట్
దువ్వాడ శ్రీనివాస్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి చేసిన రచ్చతో దివ్వెల మాధురి ఒక్కసారిగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హైలెట్ అయ్యారు. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ని తన భర్తగా చెప్పుకు తిరుగుతున్న దివ్వెల మాదిరి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా హడావిడి చేశారు.
శివాజీ భాష తప్పు కానీ ఉద్దేశం మంచిదే: దివ్వెల మాధురి
ఇక తాజాగా శివాజీ అనసూయల కాంట్రవర్సీ లో నేను ఉన్నానంటూ మాట్లాడిన దివ్వెల మాధురి అనసూయ టార్గెట్ చేశారు. శివాజీ చేసిన వ్యాఖ్యలలో ఏం తప్పు లేదని పేర్కొన్న దివ్వెల మాధురి ఆయన మాట్లాడిన దాంట్లో రెండు పదాలు మాత్రమే తప్పని, దానికి ఆయన సారీ చెప్పాడని గుర్తు చేశారు. ఆయన మాట్లాడిన భాష తప్పు కావచ్చు కానీ ఆయన ఉద్దేశం మాత్రం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనసూయ అనవసరంగా అతి చేస్తుందన్న మాధురి
అనసూయ అనవసరంగా అతి చేస్తుందని, అసలు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని అన్నారు చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని కానీ నేటితరం హీరోయిన్లు మితిమీరిన స్కిన్ షో చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.ఎవరి ఇష్టం వాళ్ళది అనుకుంటే వాళ్లు ఇష్టమైన ఉండొచ్చని, ఈ విషయంలో అనసూయ ఎక్కువగా మాట్లాడుతున్నారని దివ్వెల మాధురి వ్యాఖ్యలు చేశారు.
అనసూయకు హితవు.. ఫ్యాన్స్ ట్రోల్ చేసినా పర్లేదన్న మాధురి
ఆమె వేసుకునే బట్టలు తనకు అసలే నచ్చవని అటువంటి ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మరీ కామెడీగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సపోర్ట్ చేసేవారు తనను ట్రోల్ చేసిన తాను పట్టించుకునేది లేదని, అంతకంటే ఎక్కువ ట్రోలింగ్ తాను ఫేస్ చేశానని దివ్య మాదిరి అన్నారు ఇప్పటికైనా అనసూయ ఆపితే మంచిదంటూ సలహా ఇచ్చారు. ఇక దివ్వెల మాధురి అనసూయకు ఇచ్చిన ఘాటు కౌంటర్ పై అనసూయ స్పందిస్తుందా? అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications