Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ TO అరుణాచలం.. అతి తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ..!

మహా శివరాత్రిని పురస్కరించుకుని అనేకమంది భక్తులు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి వారికోసం IRCTC బెస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ లో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

దివ్య దక్షిణ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నుంచి రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు టికెట్ వివరాలు చూస్తే పెద్దలకు రూ.14,700 గా ఉంది. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్‌ ధరను అధికారులు నిర్ణయించారు. ఇక కంఫర్ట్ క్లాస్ అయితే పెద్దలకు రూ. 28,700, చిన్నారులకు రూ.27,400 గా నిర్ణయించారు.

ఈ టూర్ లో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు.. తదితర ప్రముఖ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇక ఈ పర్యటన మొత్తం 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన రైలు.. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టేషన్లలో ఏదైనా స్టేషన్ నుంచి మీరు రైలు ఎక్కే అవకాశం ఉంది.

ఇక ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడి నుంచి భక్తులు వసతి గృహానికి వెళ్తారు. అనంతరం అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మూడో రోజు రామేశ్వరం ఆలయ దర్శనం ఉంటుంది. అలా రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగోరోజు రామేశ్వరం నుంచి మధురై వెళ్తారు. ఐదో రోజు రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌ సెట్ పాయింట్ ను సందర్శిస్తారు. ఇక కన్యాకుమారిలోనే డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

divyadakshinyatra with Jyotirlinga Darshan Special Bharat Gaurav Train Tour Starting February 21

ఇక ఆరో రోజు త్రివేండ్రం బయలుదేరుతారు. అక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ ను సందర్శిస్తారు. ఏడోరోజు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అలా చివరగా సికింద్రాబాద్‌ కు తిరుగు ప్రయాణం అవుతారు. తంజావూరు రైల్వే స్టేషన్‌ లో రాత్రి 8 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాణంలోనే ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు రాత్రి 9 గంటలకు రైలు చేరుకుంటుంది. దాంతో ఈ టూర్ ముగుస్తుంది. ఇక టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌ సైట్ ను సందర్శించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+