దీపావళి సంబరాలు
హైదరాబాద్: తెలంగాణభవన్‌లో దీపావళి సంబురాలు ఘనంగా ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మిఠాయిలు పంచుకుని పండుగను ఘనంగా జరుపుకున్నారు. టపాసులు కాల్చుతూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మన సీఎం కేసీఆర్ రోజుకు 18 గంటలపాటు కష్టపడుతూ ఉత్తమ సీఎంగా ఎదిగారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. వీడీపీ అసోసియేట్ సర్వేలో సీఎం కేసీఆర్ మోస్ట్ పాపులర్ సీఎంగా తేలిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సీఎం కేసీఆర్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications