• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతితో జైలుకు వెళ్తావ్ కవిత; వెంటాడి, వేటాడి ఓడించేదెవ్వరు: డీకే అరుణ, ఎంపీ అరవింద్!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్సీ కవిత పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో కేంద్రంపై విరుచుకు పడిన కవిత అరెస్టు చేస్తే చెయ్యండి జైలుకు పోయేందుకు సిద్ధమంటూ ప్రస్తావించారు. ఇక కవిత చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తే అవినీతి వల్ల వెళ్తుంది.. జనం కోసం కాదు

ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తే అవినీతి వల్ల వెళ్తుంది.. జనం కోసం కాదు

ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తే అవినీతి వల్ల వెళ్తుంది.. జనం కోసం కాదు
ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళితే చేసిన అవినీతి వల్ల వెళుతుంది.. అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు గా మాట్లాడటం విడ్డూరంగా ఉందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఆమె జనం కోసం జైలుకు వెళ్ళటం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం కల్వకుంట్ల కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్న డీకే అరుణ మీరు చేసిన తప్పులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే బీజేపీ పై ఎదురుదాడి మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని నమ్మకం ఉంటే సీబీఐ, ఈడీ అంటే భయమెందుకు అని డీకే అరుణ ప్రశ్నించారు.

కవిత కు చురకలు అంటించిన ధర్మపురి అరవింద్


ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో స్పందించారు. కవిత జైలుకు వెళితే తన పైన పోటీ చేసేవారు ఎవరు అనే అర్థం వచ్చేలా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ను టార్గెట్ చేసి సెటైర్ వేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అయ్యయ్యో.. ఇప్పుడు ఎలక్షన్లలో నా మీద ఎవరు వెంటాడి వేటాడి నిలబడతారు అంటూ ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేసిన కవిత ఎక్కడ పోటీ చేసినా వెంటాడి, వేటాడి ఓడిస్తా అంటూ సవాల్ విసిరారు. అందుకే అరవింద్ కవిత నీ టార్గెట్ చేశారు.

కేంద్రంపై కవిత మండిపాటు.. ఇదో కుట్ర అంటూ అసహనం

కేంద్రంపై కవిత మండిపాటు.. ఇదో కుట్ర అంటూ అసహనం


ఇదిలా ఉంటే నేడు కవిత మీడియా సమావేశంలో మోడీ వచ్చే ముందు ఈడీ రావటం సహజం అని కవిత కేంద్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అని పేర్కొన్న కవిత మోడీ 8 ఏళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. వచ్చే ఏడాది లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులు అంటూ వ్యాఖ్యానించిన కవిత రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈడీ కేసులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.

వ్యక్తుల ప్రతిష్ట దెబ్బ తీయటానికే మీడియా లీకులు.. బీజేపీ చీప్ ట్రిక్స్


వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీయడం కోసం మీడియా లీకులు అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో పెడితే ఏమవుతుంది? ఉరి వేయరు కదా అంటూ పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత బిజెపి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా హక్కుల కోసం ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. జైల్లో పెడతారా... అయినా భయపడేది లేదన్న కవితపై బీజేపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

English summary
DK Aruna targeted kavitha saying that you will go to jail only for corruption, you are saying that it is for the people. MP Arvind satirized Kavitha saying that if she goes to jail, who will hunt and defeat in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X