వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు దూరంగానే రాహుల్.. దగ్గరగా ఎప్పుడూ లేరన్న జేజమ్మ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేత డీకే అరుణ. ఆయనకు ప్రజలు, వారి సమస్యలంటే పట్టదని మండిపడ్డారు. ఆయన ఏనాడు సమస్యల పరిష్కారం కోసం పోరాడలేదని విమర్శించారు.

సరికాదు ..
బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శల జడివాన కురిపిస్తోన్న నేపథ్యంలో డీకే అరుణ స్పందించారు. రాహుల్ కామెంట్లు ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. ఆయన ఏనాడు ప్రజలకు దగ్గరలో లేరని మండిపడ్డారు. దూరం నుంచి ప్రజల సమస్యలు కనిపించవని హితవు పలికారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం .. ఆ పార్టీ అతి విశ్వాసమేఅని స్పష్టంచేశారు. తమదే విజయమని జబ్బలు చరిచి .. చతికిలపడ్డారని గుర్తుచేశారు.

dk aruna criticize rahul gandhi

ప్రత్యామ్నాయం ..

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని మరోసారి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతుల, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ వార్డుల విభజనను టీఆర్ఎస్ పార్టీ చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది సరికాదని .. ప్రభుత్వ విధానాలను బీజేపీ ఎండగడుతుందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములు పార్టీలకు ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. భూములపై పున:పరిశీలన చేయాలని అధికారులను కోరారు.

English summary
In the wake of Rahul Gandhi's criticism of the BJP, DK Aruna responded. Rahul has criticized the comments for mocking the referendum. He was never close to the people. It is hoped that people's problems will not be seen from a distance. The main reason for the defeat of the Congress party in the elections .. It is clear that the party is very confident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X