డికె స్నిగ్ధారెడ్డి రూ. 11 కోట్లు కట్టాల్సిందే: హైకోర్టు
హైదరాబాద్: డికె స్నిగ్ధారెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. లీజును ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కేసు నడపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
రూ. 11 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ డికె స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డికె అరుణ మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే.

రూ. 1.80 లక్షల చోరీ
మెదక్: జహీరాబాద్ ఎస్‌బిఐ వద్ద రూ. 1.80 లక్షలు చోరీ జరిగింది. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తుండగా కాపు కాసిన దుండగులు బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications