అధికారులు కొడితే తిరగబడండి; ఆదివాసీలకు ఎమ్మెల్యే సీతక్క పిలుపు, అటవీఅధికారుల దాడులపై కన్నెర్ర!!

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు జరుపుతున్న దాడులపై కన్నీరు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజన గ్రామాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సీతక్క పోడు భూములు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోయ పోచ గూడెంలో ఆదివాసి మహిళలు జైలు జీవితం అనుభవించారు అని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసీ మహిళల పట్ల అధికారుల అసభ్య ప్రవర్తన .. సీతక్క ఆవేదన

ఆదివాసీ మహిళల పట్ల అధికారుల అసభ్య ప్రవర్తన .. సీతక్క ఆవేదన

పచ్చి బాలింతను కూడా వదలకుండా అధికారులు చిత్రహింసలకు గురిచేశారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. 12 మంది గిరిజన మహిళలను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల పై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. పొలాల్లో పని చేసుకుంటున్న మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఆదివాసీలంటే ఎందుకింత వివక్ష అని సీతక్క నిలదీశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రేంజ్ ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కొడితే తిరగబడాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీతక్క

కొడితే తిరగబడాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీతక్క

ఆదివాసీలను ఇష్టమొచ్చినట్టు కొడితే ఊరుకునేది లేదని మండిపడిన సీతక్క అధికారులు కొడితే తిరగబడాల్సిందే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పోడు చేసుకుని సాగు చేసుకుంటున్న భూములపై దాడులు సరికాదని, కొత్తగా అడవిని కొడితే గ్రామ సభలు పెట్టండి అంతేకానీ ఇష్టమొచ్చినట్లు దాడులు చేసి ఆదివాసీలను హింసిస్తే ఎలా అంటూ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ఆదివాసీ గిరిజనులను చూస్తే అధికారులకు ఎందుకంత ద్వేషం అంటూ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రాజెక్ట్ లకోసం అడవిని నరికితే తప్పు లేదా ? పొట్టకూటికోసం పోదు చేస్తే తప్పా?

ప్రాజెక్ట్ లకోసం అడవిని నరికితే తప్పు లేదా ? పొట్టకూటికోసం పోదు చేస్తే తప్పా?

వాళ్ల చొక్కాలు వాళ్ళే చింపుకొని ఆదివాసీల మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటూ అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల కోసం అడవిని నరికితే తప్పు లేదు కానీ ఆదివాసీలు జీవనోపాధి కోసం అడవిని నరికితే కేసులు పెడతారా అంటూ ఎమ్మెల్యే సీతక్క అటవీ అధికారులకు సూటి ప్రశ్న వేశారు. అందరూ ఏకమై ఆదివాసీల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీతక్క కోయ పోచ గూడెం లో ఆదివాసీలు 2003 ముందునుంచే పోడు చేసుకుంటున్నారని, వారు పట్టాలకు అర్హులు కాదా అంటూ ప్రశ్నించారు.

ఆదివాసీలపై అధికారుల ఆగడాలపై గవర్నర్ ను కలుస్తానన్న సీతక్క

ఆదివాసీలపై అధికారుల ఆగడాలపై గవర్నర్ ను కలుస్తానన్న సీతక్క

వారికి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. అధికారుల ఆగడాలపై తాను గవర్నర్ ను కలుస్తానని ఎమ్మెల్యే సీతక్క తేల్చిచెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కుర్చీ వేసుకుని మరి పరిష్కరిస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన ఎమ్మెల్యే సీతక్క మేము మహారాజా కుర్చీ వేస్తాం.. సమస్యను పరిష్కరించండి అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. అంతేకాదు ఆదివాసీలకు పోరాట చరిత్ర ఉందని గుర్తు చేసిన సీతక్క అన్యాయంగా దాడి చేస్తున్న వారిని ఎదిరించవలసిందేనంటూ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+