కిడ్నాప్ కలకలం: తుపాకులతో బెదిరించి డాక్టర్‌ను రాత్రంతా చితకబాదారు
హైదరాబాద్: హయత్‌నగర్‌లో ఓ ఆసుపత్రి ఎండీని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన బుధవారం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, సరూర్ నగర్‌లోని జీవన్ ఆసుపత్రి ఎండీగా ఉన్న రమేశ్ గౌడ్‌ను తాము మావోయిస్టులమని హెచ్చరిస్తూ గుర్తు తెలియని దుండగలు కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారు.
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి సమీపంలో ఓ బిల్డింగ్‌లో ఉంచి రాత్రంతా చితకబాదారాని బాధితుడు ఆరోపించారు. అనంతరం ఘటకేసర్ వద్ద చంపేస్తామంటూ తుపాకులతో బెదిరించి రూ. 50 లక్షలు వరకు చెక్‌లను తీసుకుని వదిలిపెట్టారని పేర్కొన్నాడు.
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ కిడ్నాప్‌కు ఆర్ధిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. బాధితుడు రమేష్ గౌడ్ తనను డాక్టర్ రమాదేవి, డాక్టర్ రమేష్ బాబు కిడ్నాప్ చేయించి కొట్టించారని హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సరూర్ నగర్‌లోని జీవన్ ఆసుపత్రిలో ఈ ముగ్గురు భాగస్వాములుగా ఉన్నారు.

వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, శ్రీను (24) అనే వ్యక్తి ఖాజాబాగ్‌లో నివాసం ఉంటున్నాడు.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బును చెల్లించకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారులు శ్రీనుని వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక బుధవారం ఆత్మహత్య చేసకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications