శశికుమార్ ఆ రెండు గంటలు ఏం చేశాడు?: ఆ నలుగురు వ్యక్తులపై ఆరా
హైదరాబాద్: హిమాయతనగర్‌లో జరిగిన డాక్టర్ల కాల్పుల ఘటనలో చిక్కులు వీడడం లేదు. తెరపైకి వచ్చిన మరో నలుగురు వ్యక్తులు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ సూసైడ్ నోట్‌లో ఓబుల్‌రెడ్డి, రామారావు, కె.కె.రెడ్డి, చెన్నారెడ్డిలను శిక్షించాలంటూ రాశాడు. కానీ వీరు ఎవరనేది ఇంతవరకూ తెలియరాలేదు.
కాగా, తన భర్త ఇంటినుంచి తీసుకెళ్లిన కారు, బ్రీఫ్‌కేసు కనిపించడంలేదని శశికుమార్ భార్య చెబుతున్నారు. అయితే కారును పోలీసులు హిమాయత్‌నగర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఘటనాస్థలం వద్ద సూసైడ్‌నోట్‌తోపాటు లభించిన రివాల్వర్, కొడవలి, రంపాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
మాదాపూర్‌లోని లారెల్ ఆస్పత్రి భాగస్వామ్యంలో ముగ్గురు వైద్యుల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసి, ఆ తర్వాత శశికుమార్ ఫాంహౌ్‌సలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షి సాయికుమార్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కాల్పులు జరిపింది శశికుమారేనని పోలీసులు నిర్ధారించారు.

రివాల్వర్‌లో లభించిన బుల్లెట్, ఉదయ్ శరీరం నుంచి తీసిన బుల్లెట్‌లోని అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు నార్త్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ఉదయ్ ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రస్తుతం ఐసీయూలో ఉండటంతో తర్వాత ప్రశ్నిస్తామని చెబుతున్నారు. మిగిలిన నలుగురు వ్యక్తులకు సంబంధించిన దర్యాప్తును మొయినాబాద్ పోలీసులు చేపట్టినట్లు డీసీపీ వివరించారు.
సోమవారం సాయంత్రం 4.00 నుం చి 4.15గంటల మధ్యలో కాల్పుల ఘటన జరగగా శశికుమార్ 6 గంటల సమయంలో సోమాజిగూడలోని చంద్రకళ ఇంటికి వెళ్లాడు. హిమాయతనగర్ నుంచి సోమాజిగూడ వెళ్లేందుకు అరగంట సమయం సరిపోతుంది. కానీ రెండు గంటల తర్వాత అక్కడకు చేరాడు.
రాత్రి 8 గంటల సమయానికి మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సకు చేరినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. కాల్పుల ఘటన తర్వాత ఫోన్‌కాల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు.
కానీ ఉన్నతాధికారులు మాత్రం చంద్రకళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే ఫామ్‌హౌ్‌సకు వెళ్లారంటూ వివరించారు. కాల్‌డేటాలో శశికుమార్ ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడాడనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
కారులోనే బ్రీఫ్ కేసు
పోలీసులు శశికుమార్ కారును సీజ్ చేశారు. కారులోనే బ్రీఫ్ కేసు ఉంది. 14 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో దొరికిన వ్యక్తిగత వస్తువులను కుటుంబానికి అప్పగించారు. పెద్ద మొత్తంలో చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications