Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HMPV వైరస్ పై ఆందోళన వద్దు.. జాగ్రత్తలు తీసుకుంటే చాలు..!

HMPV వైరస్ పై ఆందోళన వద్దని హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రి సూపరిండెంటెండ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. చలికాలంలో దగ్గు, జలుబు రావడం సాధారణమని ఆయన పేర్కొన్నారు. అడినో వైరస్ లాగానే హెచ్ఎంపీవీ వైరస్ ఉంటుంది. ఈ వైరస్ చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో గొంతులో ఉండకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలి.

సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. జలుబు ఉన్నవారు మిగతా వారికి దూరంగా ఉండాలంటున్నారు. ఇంట్లో ఎవరికైనా జలుబు వస్తే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక.. కరోనా లాగా హెఎంపీవీ అంతగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొన్నారు. ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలి కాలం చలి ఎక్స్ పోజ్ కావొద్దని కోరారు.

Doctors advise against worrying about HMPV virus

అయితే దేశంలో ఇప్పటికే 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగా.. గుజరాత్ లో మరో కేసు నమోదు అయింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలో 3 నెలల పాపతో పాటు 8 నెలల బాబుకు HMPV పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మరో చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో దేశంలో ఆందోళన కొనసాగుతోంది. ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

మీడియాలోని కొన్ని ఛానళ్ల వారు అనవసరంగా ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్ లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+