Dog: సూర్యాపేట జిల్లాలో దారుణం.. బాలికపై కుక్కల దాడి..
సూర్యాపేట జిల్లాలో బాలికపై కుక్కలు దాడి చేశాయి.
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైరవీహరం చేస్తున్నాయి. ప్రజలపై దాడు చేస్తూ భయభ్రంతులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని చాలా మంది జీహెచ్ఎంసీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల కుక్కల దాడి వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా చిన్నారిపై వీధి కుక్క దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో బాలికపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో జహీదా అనే పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పాపను మెరుగైన చికిత్స కోసం హుజుర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్చి 7న చంపాపేట డివిజన్ యాదగిరినగర్‌కాలనీ సంతోషనగర్ ప్రధాన రహదారి పక్కన నిద్రిస్తున్న యాచకుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.

మార్చి 8న సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో 9 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. బాలిక ప్రతిఘటించినా కుక్కలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఇది గమనించిన చేపూరి తిరుపతి అనే మోటార్ మెకానిక్ కుక్కలను తరిమి బాలికను రక్షించాడు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోను ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జీహెచ్ఎంసీ త్వరగా మేల్కొండి అంటూ రాసుకొచ్చారు. అంబర్ పేట ఘటన తర్వాత వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విఫలమైందంటూ ఆర్జీవీ అసహనం వ్యక్తం చేశారు. కుక్కలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications