వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం షాకిచ్చింది. అక్టోబర్ 26వ, తేదిన పార్టీ శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ రేవంత్‌రెడ్డిని ఆదేశించారు.అంతేకాదు వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభపక్షనేత పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించాలని చంద్రబాబుకు ఎల్. రమణ లేఖ రాశారు.

రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

Recommended Video

Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ నాయకత్వం కొరడా ఝుళిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో పార్టీ నాయకత్వం రేవంత్‌పై చర్యలకు ఉపక్రమిస్తోంది.

బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

ఈ నెల 26వ, తేదిన టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీ నేతలను కూడ ఆహ్వనించారు. వాస్తవానికి టిడిఎల్పీ సమావేశానికి పార్టీ నేతలు అవసరం లేదు. కానీ, ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలను ఆహ్వనించడం గమనార్హం.

రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?

అయితే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టిడిపి నాయకత్వం చర్యలను ప్రారంభించింది.. తొలుత ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనే మీమాసంలో ఉన్న టిడిపి నాయకత్వం ఏకంగా ఈ సమావేశం రేవంత్ నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని రేవంత్‌ను ఆదేశించిన ఎల్.రమణ

టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని రేవంత్‌ను ఆదేశించిన ఎల్.రమణ

టిడిఎల్పీ సమావేశాన్ని అక్టోబర్ 26వ, తేదిన నిర్వహించకూడదని టిడిపి శాసనసభపక్ష నేత రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ . రమణ ఆదేశించారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాలు కూడ నిర్వహించకూడదని ఎల్.రమణ రేవంత్‌ను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.రేవంత్‌పై టిడిపి నాయకత్వం చర్యలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తోందని ఈ పరిణామాలను బట్టి చూస్తే అర్ధమౌతోంది. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇదివరకే రమణ ప్రకటించారు. రేవంత్‌ ఎపిసోడ్‌పై పార్టీ నేతలు ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడుకు సమాచారమిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు సూచన మేరకు ఎల్. రమణ రేవంత్‌ను శాసనసభపక్ష సమావేశం నిర్వహించకూడదని నిర్ణయించినట్టు సమాచారం.

రేవంత్‌ను పదవుల నుండి తొలగించాలని బాబుకు రమణ లేఖ

రేవంత్‌ను పదవుల నుండి తొలగించాలని బాబుకు రమణ లేఖ

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారనే ప్రచారం సాగుతున్నందున పార్టీ అత్యున్నత పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించాలని టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.టిడిపి శాసనసభపక్షనేత పదవితో పాటు, టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ పదవుల నుండి రేవంత్‌ను తొలగించాలంటూ ఎల్. రమణ బాబుకు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

అక్టోబర్ 26న, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల సమావేశం

అక్టోబర్ 26న, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల సమావేశం

టిడిపి శాసనసభపక్ష సమావేశం అక్టోబర్ 26వ, తేదిన నిర్వహించే అవకాశం లేనట్టేనని భావిస్తున్నారు. అయితే బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల సమావేశం అక్టోబర్ 26వ, తేది మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి టిడిపి కీలకనేతలు కూడ హజరయ్యే అవకాశం ఉంది.

రేవంత్ వ్యూహమేమిటీ?

రేవంత్ వ్యూహమేమిటీ?

అక్టోబర్ 26వ, తేదిన టిడిపి శాసనసభపక్ష సమావేశం నిర్వహించకూడదని ఎల్. రమణ ఆదేశించడంతో రేవంత్‌రెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి టిడిపి ఎమ్మెల్యేల సమావేశానికి రేవంత్‌రెడ్డి హజరౌతారా లేదా అనేది కూడ ఆసక్తిని కల్గిస్తోంది. అక్టోబర్ 26న,, రేవంత్ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే టిడిఎల్పీ సమావేశానికి సండ్రవెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్య హజరౌతారా, పార్టీ ఆదేశాలను పాటిస్తారా అనేది కూడ రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

English summary
TDP president L. Ramana ordered Revanth Reddy don't conduct TDLP meeting on Oct 26. L. Ramana wrote a letter Chandrababu naidu to remove party posts from Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X