మళ్లీ మళ్లీ తప్పు చేస్తారా?: ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: కరవు నివారణ చర్యలు చేపట్టడంలో తాము ఇచ్చిన ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే బేఖాతరు చేస్తున్నాయని సుప్రీం కోర్టు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవును ఎదుర్కోవడంలో గత ఏడాది చేసిన తప్పులనే పునరావృతం చేయొద్దని ప్రభుత్వాలని హెచ్చరించింది.
గత ఏడాది కరవు కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పన్నెండు రాష్ట్రాలలోని రైతులు పడుతున్న ఇబ్బందులపై స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థ నిర్వాహకుడు ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. వాతావరణ శాఖ నివేదిక ప్రకారమే దేశంలోని కనీసం 149 జిల్లాల్లో తగినంతగా వర్షాలు కురవలేదన్నారు.

కరవు ప్రాంతాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ నిత్యావసరాలు అందించాల్సి ఉన్నా, ఏ రాష్ట్రమూ దానిని అమలు చేయడం లేదన్నారు. ఇందుకు ఆధారాలు చూపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద స్వతంత్ర ప్రతిపత్తిగల ఆహార కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరాలు, మహిళా కమిషన్లు, శిశు సంరక్షణ కమిషన్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాయన్నారు.
దీనిపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయవద్దని, ఇల్లు తగలబడుతున్నప్పుడే బావిని తవ్వవద్దని సుప్రీం చురకలు అంటించింది. బుధవారం జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎన్వి రమణలో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. మేం ఆదేశాలిచ్చినా రాష్ట్రాలు పాటించవని, కేంద్రం చేతులెత్తేస్తుందన్నారు.
కరవు నివారణ చర్యలు చేపట్టడంలో తాము ఇచ్చిన ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే బేఖాతరు చేస్తున్నాయని సుప్రీం కోర్టు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవును ఎదుర్కోవడంలో గత ఏడాది చేసిన తప్పులనే పునరావృతం చేయొద్దని ప్రభుత్వాలని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications