ఆ పటాకులు కొనొద్దు.. కాల్చొద్దు: దీపావళి వేళ కుట్ర అంటూ రాజా సింగ్
దేశ వ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పండగ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పటాకులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని, అలాంటి వాటిని బహిష్కరించాలని ప్రజలను కోరారు. 'నమస్కారం మిత్రులారా.. నేనే మీ రాజా సింగ్.. ఇవాళ, రేపు రెండ్రోజులపాటు దీపావళి పండగ మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దీపావళి పండగ రోజు చాలా పెద్ద ఎత్తున పటాకులు తెప్పించి కాల్చుతున్నాం. కానీ, కొద్ది జాగ్రత్త, చిన్న పిల్లలు ఉంటారు' అని చెప్పారు రాజా సింగ్.

చిన్న పిల్లలు ఏ పటాకాలో ఎంత పెద్ద బ్లాస్టర్ ఉంటుందో వారికి తెలియదు. అందుకే మన పిల్లల వెంట ఉండి పటాకులు కాల్చాలని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా చాలా పెద్ద కుట్ర.. ఒకప్పుడు జరిగిన కుట్ర కంటిన్యూగా అదే విధంగా జరుగుతోంది. దీపావళి అంటే మనం లక్ష్మీమాతకు పూజ చేస్తాం. అదే పటాకాలో మన లక్ష్మీ మాత బొమ్మ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర నడిస్తోంది అని రాజా సింగ్ అన్నారు.
మనమంతా కలిసి దేవుడి బొమ్మ ఉన్న పటాకులు కొనవద్దు. కాల్చవద్దు. వచ్చే ఏడాది ఎవరూ లక్ష్మీదేవీ బొమ్మ ఉన్న పటాకులు తయారు చేయరు.కొనరు. ఈ విధంగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటున్నాను. మరొక్క సారి దీపావళి శుభాకాంక్షలు అని రాజా సింగ్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications