వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవాణా సౌకర్యంలేక ఏ ఒక్కరి ప్రాణం పోవొద్దు.!ఉచితంగా 13 ఆంబులెన్సులను ఏర్పాటు చేస్తానన్న జగ్గారెడ్డి.!

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి/హైదరాబాద్ : ఆక్సీజన్, రవాణా సౌకర్యం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి వీల్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేసారు. గత వారం హైదరాబాద్ లో కరోనా బాదితుల కోసం మూడు ఆంబులెన్సులను సిద్దం చేసిన జగ్గారెడ్డి తన నియోజకవర్గం సంగారెడ్డిలో కరోనా బాదితులకు తనవంతు సాయం అందిస్తున్నారు. ఆక్సీజన్ కోరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చూసిన జగ్గారెడ్డి సొంత ఖర్చులతో 50 ఆక్సీజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సనఫరా చేసారు.

 ఏఐసీసీ పిలుపు మేనకు కరోనా బాదితులకు సేవ.. 13ఆంబులెన్సులను ఏర్పాటుకు జగ్గారెడ్డి శ్రీకారం..

ఏఐసీసీ పిలుపు మేనకు కరోనా బాదితులకు సేవ.. 13ఆంబులెన్సులను ఏర్పాటుకు జగ్గారెడ్డి శ్రీకారం..

ఆతర్వాత ఇంట్లోనే హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ఉచిత టోల్ ఫ్రీ నంబర్ ను కూడా బాదితుల కోసం ఏర్పటు చేసారు జగ్గారెడ్డి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో తన నియోజక వర్గ ప్రజలకోసం మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రజల ప్రణాలను కాపడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలకంటే ముఖ్యం ఏదీ కాదని జగ్గారెడ్డి చెప్పుకొస్తున్నారు. మనిషి ప్రాణాలతో ఉంటే ఏదైనా సాధించొచ్చని, ప్రాణాలు గాల్లో కలిసిపోయాక చేసేది ఏముండదని చెప్పుకొస్తున్నారు. అందుకే ఆర్థిక భారం అయినప్పటికి ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యతనిస్తున్నట్టు తెలిపారు జగ్గారెడ్డి.

 ప్రజల ప్రాణాలు విలువైనవి.. ప్రాణాలను కాపాడుకుంటే ఏదైనా సాధించొచ్చన్న జగ్గారెడ్డి..

ప్రజల ప్రాణాలు విలువైనవి.. ప్రాణాలను కాపాడుకుంటే ఏదైనా సాధించొచ్చన్న జగ్గారెడ్డి..

సంగారెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యులు తూర్పు జగ్గారెడ్డి గారు పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి ఒకటి సంగారెడ్డి టౌన్ లో మరొకటి సదాశివపేట లో అందుబాటులో ఉంటాయి. అవసరమున్న వారు క్యాంప్ ఆఫీస్ నెంబర్ 08455-278355 కి ఫోన్ చేసి తమ అవసరం నిమిత్తం కరోనా బాదితులకోసం ఉచితంగా ఈ ఆంబులెన్స్ సేవలను ఉపయెగించుకోవచ్చని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందుకోసం 24/7 తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు.

 పేదవారికి సేవచేసే ద్యేయంతోనే ఆంబులెన్స్ ల ఏర్పాటు.. బాదితులు ఉపయోగించుకోవాలన్న ఎమ్మెల్యే..

పేదవారికి సేవచేసే ద్యేయంతోనే ఆంబులెన్స్ ల ఏర్పాటు.. బాదితులు ఉపయోగించుకోవాలన్న ఎమ్మెల్యే..

ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ వల్ల ప్రభుత్వ ఆంబులెన్స్ ల సేవలను తక్కువచేసి చూపించే ఉద్దేశం తనకు లేదని, డబ్బులు లేక ఇబ్బంది పడే పేద ప్రజల కోసమే ఈ బృహత్కర కార్యక్రమం అని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి. డబ్బులు ఉన్నవారు ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ఉపయోగిస్తారని, డబ్బులు లేని నిరుపేదలు తాను ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఉపయోగిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెట్పీ టీసీలు, వార్డ్ మెంబెర్ లు పార్టీ ప్రజాప్రతినిధులు అందరు ఈ సర్వీస్ ని ఉపయోగించి మీ పరిధిలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడేలా సేవ చేయలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు.

 రాజకీయ కోణం లేదు.. కేవలం ప్రజాసేవే లక్ష్యంగా ఆంబులెన్స్ లు ఏర్పాటన్న జాగ్గారెడ్డి..

రాజకీయ కోణం లేదు.. కేవలం ప్రజాసేవే లక్ష్యంగా ఆంబులెన్స్ లు ఏర్పాటన్న జాగ్గారెడ్డి..

ప్రజల ఆరోగ్యం కోసం మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజక ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒకటి, రెండు మున్సిపాలిటీలకు చెరొకటి, అలాగే ప్రతి గ్రామానికి అంబులెన్స్ చేరుకునే విధంగా కొన్ని అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అంబులెన్స్ లు ఏర్పాటు చేయగానే ఎక్కడ ఎవరిని సంప్రదించాలో వారి నెంబర్ లు తెలియచేస్తామన్నారు. ఇందులో రాజకీయకోణం లేదని, కేవలం తన తల్లిదండ్రుల పేరుమీద ప్రజా సేవ చేయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాలు చేస్తున్నానని జగ్గారెడ్డి వివరించారు.

Recommended Video

Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!

English summary
Jaggareddy assured the people of the Sangareddy constituency that another 13 ambulances would be set up soon for the health of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X