ఇవాంకా టూర్: డేగ కళ్ల నిఘా, సదస్సు ప్రాంగణం, బస అన్నీ.. యూఎస్ సెక్యూరిటీ చేతుల్లోకి...
ఈనెల 28 నుంచి మూడురోజులపాటు నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం సాగుతున్నాయి
హైదరాబాద్: ఈనెల 28 నుంచి మూడురోజులపాటు నగరంలో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం సాగుతున్నాయి.
ఇవాంకా కు సంబంధించిన భద్రతా చర్యల్లో భాగంగా అమెరికా నుంచి తెచ్చుకునే ఆయుధాలకు అనుమతి కోరుతూ అమెరికా భద్రతా విభాగం ఇప్పటికే మన కస్టమ్స్ అధికారులకు లేఖ కూడా రాసింది.
అటు అమెరికా భద్రతా విభాగం అయిన యూఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌తోపాటు మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, , ఆక్టోపస్ కమాండోస్, గ్రేహౌండ్ సిబ్బంది.. హైదరాబాద్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ, ఇవాంకాట్రంప్ సందర్శించే ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్నిపర్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

అడుగడుగునా డేగ కళ్ల నిఘా...
నగరంలో ఇవాంకా పర్యటన సందర్భంగా పాత బస్తీలో 40 వేలకుపైగా సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. అలాగే అతిథులు బస చేసే హోటళ్ల వద్ద పోలీసు భద్రతను పటిష్ఠం చేస్తున్నారు. నెలరోజుల క్రితమే కొంతమంది అమెరికా పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడే మకాం వేసి ఎస్పీజీ బలగాలతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలతో నిన్నట్నించే అంతర్గత సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ నుంచి మాదాపూర్ వరకు, అటునుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకూ రిహార్సల్స్ కూడా నిర్వహించారు. భద్రతా చర్యలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్ కమిషనర్ సందీప్‌శాండిల్య సమీక్షిస్తున్నారు.

ఒక్క ఐపీఎస్ అధికారి యూనిఫాంలో..
ట్రంప్ కుమార్తె ఇవాంకా భద్రత విషయంలో అమెరికా భద్రతా విభాగం ముందునుంచీ అనేక సూచనలు చేస్తూ వస్తోంది. భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంచరాదని, సమావేశ మందిరంలో తక్కువ సిబ్బందిని ఉంచాలనేవి వాటిలో ప్రధానమైనవి. ఇక, సమావేశ మందిరంలో ప్రతినిధులు కాకుండా సుమారు 50 మంది అత్యంత సుశిక్షితులైన సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నట్లు సమాచారం. వీరంతా సివిల్ డ్రెస్సుల్లోనే ఉంటారు. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే పోలీస్ యూనిఫాంలో ఉండేందుకు అమెరికా అధికారుల నుంచి అనుమతి లభించింది. సమావేశ మందిరం బయట, సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో వెయ్యి మంది పోలీసులు మోహరించనున్నారు.

ప్రత్యేక వ్యక్తుల భద్రత వారిపైనే...
పోలీసులైనా సరే ఆయుధాలతో ఇవాంకా ట్రంప్ ముందుకు రాకూడదని అమెరికా పోలీసులు కండీషన్ పెట్టారనే అంశంపై ఓ డీసీపీ స్పందించారు. ఇటువంటి సదస్సుల్లో ప్రొటోకాల్‌కే ప్రాధాన్యం ఉంటుందని, ఆయుధాలు వాడరాదనే నిబంధన ఉండదన్నారు. అయితే ప్రత్యేక భద్రత ఉన్న వ్యక్తులకు సంబంధించి వారి ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పుడు.. భద్రత మొత్తం వారే చూసుకుంటారని, అలాంటి సమయంలో ఆయుధాలతో అవసరముండదని భావించి తామే వాటిని తీసుకెళ్లమని చెప్పారు. ప్రధాని, సీఎం భద్రతలకు కూడా ఇదే వర్తిస్తుందని ఆ డీసీపీ వ్యాఖ్యానించారు.

సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు...
ఇవాంకా, ప్రధాని మోడీ రాకపోకలు సాగించే మార్గంలో సుమారు 20కిపైగా సమస్యాత్మక ప్రాంతాలు(బ్లాక్ స్పాట్స్)ను అధికారులు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవాంకా సుమారు 37 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించనున్నారు. అక్కడ విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు, తాత్కాలిక కంట్రోల్‌రూంతోపాటు సాంకేతికత, నిఘాకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవాంకా.. చార్మినార్, లాడ్ బజార్, చౌహమల్లా ప్యాలెస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఒక్క తాజ్ ఫలక్‌నుమా ఏరియాలోనే దాదాపు 3500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగించనున్నారు. ఇక.. ఫలక్‌నుమా దగ్గర్లోని ఫాతిమా నగర్, ఫరూఖి నగర్, అల్ జుబేల్ కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసే పనిలో పడ్డారు పోలీసులు.

తొలిరోజు డిన్నర్ ఫలక్‌నుమాలోనే...
ట్రంప్ కుమార్తె ఇవాంకా తొలిరోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో, రెండో రోజు గోల్కొండలో డిన్నర్ చేయనున్నారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇవాంకా, ప్రధాని మోడీతోపాటు మొత్తం 1400 మంది ప్రతినిధులు 60 బస్సుల్లో ఫలక్‌నుమా ప్యాలె స్‌కు చేరుకుని అక్కడ డిన్నర్ చేయనున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ లో నిజాం వంశీయుల కాలం నుంచి వస్తున్న ప్రత్యేక డిన్నర్ టేబుల్‌పై ఇవాంకా డిన్నర్ చేయనున్నారు. ఈ టేబుల్ పై ఒకేసారి 101 మంది భోజనం చేయొచ్చు. ఇవాంకా, ప్రధానితోపాటు మరికొందరు ప్రముఖులు ఇక్కడ విందు ఆరగించనున్నారు. ఇదే తరహాలో గోల్కొండలోనూ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హోటళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు...
ఇవాంకా ట్రంప్ బస చేయనున్న వెస్టిన్ హోటల్‌ను కూడా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు సదస్సుకు మూడు రోజుల ముందుగానే పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇంకా అమెరికా నుంచి వచ్చే దాదాపు 500 మంది, ఇతర దేశాల నుంచి వచ్చే మరో 500 మందితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే దాదాపు 400 మంది ప్రతినిధులు పార్క్ హయత్, గ్రాండ్ కాకతీయ, తాజ్ కృష్ణ, తాజ్ దక్కన్, నోవాటెల్, ఇతర ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు. వీరు బస చేసే అన్ని హోటళ్ల వద్ద పోలీసు అధికారులు అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications